అమ్మాయిల క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌

చివరి టీ20లోనూ
విండీస్‌‌‌‌‌‌‌‌పై గెలుపు
5-0తో సిరీస్‌‌‌‌‌‌‌‌ కైవసం

ప్రొవిడెన్స్‌‌‌‌‌‌‌‌(గయాన):  వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌ను ఇండియా మహిళల క్రికెట్‌‌‌‌‌‌‌‌ టీమ్ సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా ఫినిష్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఇప్పటికే వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. టీ20ల్లో వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ను వైట్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను 5–0తో క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌ చేసింది. వేదా కృష్ణమూర్తి (48 బంతుల్లో 4 ఫోర్లతో 57 నాటౌట్‌‌‌‌‌‌‌‌), జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌ (56 బంతుల్లో 3 ఫోర్లతో 50) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలకు తోడు స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అనుజా పాటిల్‌‌‌‌‌‌‌‌ (3–1–3–2) కట్టుదిట్టమైన బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో గురువారం జరిగిన ఐదో, చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 61 పరుగుల తేడాతో విండీస్‌‌‌‌‌‌‌‌ను చిత్తుగా ఓడించింది.

టాస్‌‌‌‌‌‌‌‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 134 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మ (9), కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మంధాన (7) ఫెయిలైనా..  రోడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌, వేద మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 117 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి జట్టుకు మంచి స్కోరు అందించారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన విండీస్‌‌‌‌‌‌‌‌ మహిళల టీమ్‌‌‌‌‌‌‌‌ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 73 రన్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే చేసింది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ కైషోనా నైట్‌‌‌‌‌‌‌‌ (22) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌.   వేద ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌గా నిలవగా, యువ ఓపెనర్‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మకు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌‌‌‌‌‌‌ అవార్డు దక్కింది.

మరిన్ని వార్తల కోసం

Latest Updates