టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై ఇండియా విక్టరీ

టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా.. న్యూజిలాండ్‌పై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్‌లో ఇండియన్ టీంకు ఇది మూడో మ్యాచ్. ఆడిన మూడు మ్యాచులలోనూ ఇండియా విజయం సాధించి, హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. ఈ మ్యాచుకు ముందు ఇండియా.. బంగ్లాదేశ్ మరియు ఆసీస్‌లను ఓడించింది. వరుసగా మూడు మ్యాచులలో గెలిచి ఇండియా సెమీస్‌కు చేరింది.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకొని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత టీం 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య చేధనలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. భారత ప్లేయర్ షెఫాలి వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

For More News..

బిల్ కౌంటర్‌లు లేని సూపర్ మార్కెట్

ప్రపంచంలోనే అత్యంత విలువైన రేస్.. రూ.143 కోట్ల ప్రైజ్ మనీ

ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ ఊళ్లో 400 జతల కవలలు

Latest Updates