ఉమెన్స్ టీ20: 7 వికెట్ల తేడాతో ఇండియా ఘనవిజయం

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈరోజు మెల్‌బోర్న్‌లో భారత్, శ్రీలంకలు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ రాధా యాదవ్ చెలరేగింది. నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకుంది.

ఆ తర్వాత చేజింగ్‌కు దిగిన భారత్ 14.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగుల సాధించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇండియాకిది వరుసగా నాలుగో గెలుపు. ఇప్పటికే సెమీస్‌కు చేరిన టీంఇండియా వరుసగా నాలుగు మ్యాచులు గెలిచి హ్యాట్రిక్ సాధించింది. గ్రూప్ ఏ విభాగంలో భారత్ టాప్ ప్లేస్‌లో ఉంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు 4 వికెట్లు తీసిన రాధిక యాదవ్‌కు దక్కింది.

For More News..

బస్సును ఢీకొన్న రైలు.. మూడు ముక్కలైన బస్సు

మార్చిలో బ్యాంక్‌లకు 12 రోజులు సెలవులు

నాకు కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది

కరోనా ఎఫెక్ట్: ఒక్కో మాస్క్ రూ. 4 లక్షలు

Latest Updates