ఇండియాకు 8 గోల్డ్‌ మెడల్స్‌

కామన్వెల్త్‌‌ వెయిట్‌‌లిఫ్టింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా ప్లేయర్లు పతకాల పంట పండించారు. మంగళవారం టోర్నీ తొలిరోజున వివిధ విభాగాల్లో ఎనిమిది స్వర్ణాలు సహా 13 పతకాలు సాధించారు. సీనియర్‌‌ విమెన్‌‌ 49 కిలోల విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్‌‌ మీరాబాయి చాను విజేతగా నిలిచింది. మొత్తం 191 కేజీలు (84+107 కిలోలు) బరువెత్తి గోల్డ్‌‌మెడల్‌‌ పట్టేసింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌‌ క్వాలిఫికేషన్‌‌కు కీలకమైన పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక సీనియర్‌‌ విమెన్‌‌ 45 కేజీల విభాగంలో జిలి దలబెహ్రా గోల్డ్‌‌మెడల్‌‌ సాధించింది. అలాగే  సీనియర్‌‌ విమెన్‌‌ 55 కేజీ విభాగంలో సోరొయిఖైబాన్‌‌ బింద్యారాణి దేవి గోల్డ్‌‌ నెగ్గగా.. మత్స సంతోషి రజతం సాధించింది. మరోవైపు  రిషికాంత సింగ్‌‌ (సీనియర్‌‌ మెన్‌‌ 55 కేజీ) విభాగంలో బంగారు పతకాలు సాధించాడు.

Latest Updates