బంగ్లా చిత్తు.. ఇన్నింగ్స్ 130 రన్స్ తేడాతో ఇండియా విన్

ఇండోర్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో ఇండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది భారత్.  రెండో రోజు ఆట ముగిసే సమయానికి  493/6  పరుగుల వద్ద ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మూడో రోజు శనివారం రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన బంగ్లాదేశ్ ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. దీంతో 213 పరుగులకే ఆలౌట్ అయింది . బంగ్లా బ్యాట్స్ మెన్ ముషిఫికర్ ఒక్కడే 64 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లు షమి 4 ,అశ్విన్ 3, ఉమేశ్  2,ఇషాంత్ ఒక వికెట్ తో చెలరేగడంతో బంగ్లాదేశ్ 69.2 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో  రెండు టెస్టుల సిరీస్ లో 1-0 తో అధిక్యంలో ఉంది భారత్.

బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 150, రెెండో ఇన్నింగ్స్ లో 213 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ ను 493/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో మయాంక్ 243 పరుగులతో అదరగొట్టాడు.

 

Latest Updates