ఫైనల్ T20 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా

హామిల్టన్ : 3 T20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇవాళ సెడాన్ పార్క్ స్టేడియంలో కీలకమైన ఆఖరి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ… ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు మ్యాచ్ ల అనుభవాలతో తమ వ్యూహాలతో సిద్ధంగా ఉన్నామని చెప్పాడు రోహిత్. 

తొలి టీట్వంటీని న్యూజీలాండ్ భారీ తేడాతో గెలిచింది. రెండో టీట్వంటీ మ్యాచ్ లో టీమిండియా జయభేరి మోగించింది. మూడో టీట్వంటీలోనూ గెలిచి వన్డే సిరీస్ తో పాటు.. టీట్వంటీ సిరీస్ ను కూడా గెలవాలని బారత జట్టు ఉత్సాహంగా ఉంది. 

Latest Updates