పంత్ ను కాదని దినేశ్ కు ఛాన్స్..చీఫ్ సెలక్టర్ క్లారిటీ

ప్రపంచ కప్  జట్టులో  రిషబ్ పంత్ కు ఛాన్స్  వస్తుందని అందరు అనుకున్నారు.  కానీ ఇవాళ  ఇవాళ ప్రకటించిన టీంలో పంత్ పేరు లేక పోవడం ఆశ్చర్యం కల్గించింది. జట్టులో రిజర్వ్ వికెట్ కీపర్ గా పంత్ కు చోటు దక్కుతుందని మాజీ క్రికెటర్లు కూడా అంచనా వేశారు. కానీ ధోనికి ప్రత్యామ్నాయంగా రిజర్వ్ కీపర్ గా  పంత్ కు బదులు దినేశ్ కార్తీక్ ను ఎంపిక చేశారు. అయితే దీనిపై  భారత చీఫ్ సెలక్టర్ ఎంఎస్ కే ప్రసాద్ వివరణ ఇచ్చారు.  గాయం కారణంగా ఏదైనా మ్యాచ్ కు ధోని దూరం అయితే ఆ ప్లేస్ లో దినేశ్ కార్తిక్ ఆడతాడని  అన్నారు. దినేశ్ ఒత్తిడిని తట్టుకొని ఆడడంలో మంచి అనుభవం ఉందని.అతని ఆట కూడా పరిగణలోకి తీసుకున్నామని అన్నారు. అందుకే రిషబ్ పంత్ ను కాదని దినేశ్ కార్తీక్ ను తీసుకున్నామని చెప్పారు.

Latest Updates