భారతీయుడు -2 క్రేన్ ఆపరేటర్ అరెస్ట్

నిర్లక్ష్యమే కారణమంటున్న పోలీసులు

చెన్నై: భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాద ఘటనలో క్రేన్ ఆపరేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షూటింగ్ సమయంలో నెగ్లిజెన్స్‌గా వ్యవహరించి ముగ్గురు చనిపోవటానికి కారణమయ్యాడంటూ  అతనిపై కేసు నమోదు చేశారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది ? క్రేన్ సడెన్ గా పడిపోవటానికి కారణాలేంటన్న దానిపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది మాత్రం పోలీసులు వెల్లడించటం లేదు. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయని చెబుతున్నారు. చెన్నైలోభారతీయుడు 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో క్రేన్ పడిపోవటంతో ముగ్గురు టెక్నీషియన్స్ చనిపోయారు.  ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. ప్రమాదానికి నాలుగు సెకన్ల ముందే డైరెక్టర్ శంకర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాను, హీరోయిన్ కాజోల్ కూడా కొన్ని నిమిషాల ముందే సంఘటన స్థలం నుంచి వెళ్లిపోవటంతో బతికిపోయామని హీరో కమల్ హాసన్ చెప్పారు.

Latest Updates