భారత ఆర్మీ రూల్స్ బ్రేక్ చేసింది : పాక్

ఇస్లామాబాద్: ఎల్వోసీ దగ్గర భారత ఆర్మీ రూల్స్ బ్రేక్ చేసిందని తెలిపింది పాకిస్థాన్. భార‌త వైమానిక ద‌ళానికి చెందిన మిరేజ్ యుద్ధ విమానాలు ఇవాళ తెల్ల‌వారుజామున 3-30 గంటలకు LOC వెంట ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌పై భీకర దాడులు  చేశాయి. మిరేజ్ యుద్ధ విమానాల‌తో జైషే స్థావ‌రాల‌ను ధ్వంసం చేసింది భారత వైమానిక దళం. దీనిపై స్పందించాడు పాక్ ఆర్మీ ప్ర‌తినిధి మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆసిఫ్ గ‌ఫూర్. ముజ‌ఫ‌రాబాద్ సెక్ట‌ర్‌ లో 3 లేదా 4 మిసైళ్ల‌తో దాడి జ‌రిగిన‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు. అయితే ఐఏఎఫ్ దాడి స‌మ‌యంలో ఓ పేలోడ్ అక్క‌డ ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

 

 

 

Latest Updates