అమర్ నాథ్ యాత్ర మార్గంలో పాకిస్తాన్ స్నైపర్ రైఫిల్ స్వాధీనం

అమర్ నాథ్ యాత్ర మార్గంలో స్నైపర్ రైఫిల్ ను స్వాధీనం చేసుకుంది ఆర్మీ. స్నైపర్ రైఫిల్ తో మందుపాత్రను స్వాధీనం చేసుకున్న సైన్యం అవి పాకిస్తాన్ ఆర్మీకి చెందినవిగా గుర్తించారు. అమర్ నాథ్ యాత్రను డిస్టర్బ్ చేసేందుకు పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు కచ్చితమైన ఇంటెలిజెన్స్ నివేదికలున్నాయన్నారు చినార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ K J S ధిల్లాన్. కశ్మీర్ లో శాంతియుత పరిస్థితులను చెడగొట్టేందుకు పాకిస్తాన్ సైన్యం ప్రయత్నిస్తోందన్నారు. కశ్మీర్ లో శాంతికి భంగం కలగనివ్వబోమన్నారు ధిల్లాన్.

Latest Updates