హిమాలయాల్లో ‘స్నో మ్యాన్’: పాదముద్రలు కనుగొన్న భారత ఆర్మీ

స్నో మ్యాన్ ఇదో మిస్టరీ ఇష్యూ… మంచు మనిషి ఉన్నాడా లేడా అన్నది దశాబ్దాలుగా జరుగుతున్న చర్చ… అయితే  భారత ఆర్మీ ఇందుకు సంబంధించి ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈనెల 9న మకాలూ బేస్ క్యాంప్ సమీపంలో మంచులో అనుమానాస్పద పాదముద్రలను భారత ఆర్మీ గుర్తించింది. మొదటి సారి మిస్టీరికల్ ఫూట్ ప్రింట్స్ ను కనుగొన్నట్టు తెలిపింది. గతంలో మకాలూ బారున్ నేషనల్ పార్క్ సమీపంలోనే మంచు మనిషి ఆనవాళ్లు కనిపించాయి. ఇన్నాళ్లకు మళ్లీ భారత ఆర్మీ బయటపెట్టిన ఆధారాలు చర్చకు దారి తీశాయి. గతంలో వచ్చిన సిద్ధాంతాలకు ఈ పాదముద్రలు దగ్గరగా ఉండడంతో ఆ ఫోటోలను ఆర్మీ ట్వీట్ చేసింది.

Latest Updates