ఆర్మీ చేతికి ట్యాంక్ కిల్లర్లు

ట్యాంకు కిల్లర్లు ఇండియన్​ ఆర్మీ చేతికి వచ్చేశాయి. మన మీదకు దూసుకొచ్చే శత్రు దేశాల యుద్ధ ట్యాంకుల భరతం పట్టే ఇజ్రాయెలీ యాంటీ ట్యాంక్​ గైడెడ్​ మిసైల్​ స్పైక్​ ఆర్మీలోకి చేరాయి. డిఫెన్స్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ ఆర్గనైజేషన్​ (డీఆర్​డీవో) సొంత టెక్నాలజీతో తయారు చేస్తున్న మ్యాన్​పోర్టబుల్​ యాంటీ ట్యాంక్​ గైడెడ్​ మిసైళ్లు (ఎంపీఏటీజీఎం) లేట్​ అయ్యే అవకాశాలుండడంతో, అవి అందుబాటులోకి వచ్చే వరకు ఇజ్రాయెల్​ స్పైక్​లను వాడాలని ఆర్మీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే పుల్వామా దాడి ఘటన, బాలాకోట్​ ఎయిర్​స్ట్రైక్స్​ వంటి వాటితో ఆర్మీ స్పైక్​ మిసైళ్లకు ఆర్డరిచ్చింది. అందులో భాగంగా తొలి దశలో 210 మిసైళ్లు, కొన్ని లాంచర్లు పది రోజుల క్రితం ఆర్మీ చేతికి వచ్చాయని సైనిక అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బార్డర్​లోని పరిస్థితుల దృష్ట్యా ఆర్మీ వైస్​ చీఫ్​ ఎమర్జెన్సీ ప్రొక్యూర్​మెంట్​ పవర్స్​ను (అత్యవసర ఆయుధ కొనుగోలు అధికారం) ఉపయోగించి స్పైక్​ మిసైళ్లను కొన్నట్టు చెప్పారు. వీటి కోసం ₹280 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెబుతున్నారు. 4 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను స్పైక్​ మిసైళ్లు ఈజీగా ఛేదించగలవు. వచ్చే ఏడాది కల్లా డీఆర్​డీవో మిసైళ్లు రెడీ కాకపోతే మరిన్ని స్పైక్​ మిసైళ్లకు ఆర్డర్​ ఇస్తామని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. డీఆర్​డీవో మాత్రం వచ్చే ఏడాది కల్లా ఎంపీఏటీజీఎం యూజర్​ ట్రయల్స్​ చేస్తామని అంటోంది. ఇన్​ఫ్రారెడ్​ ఇమేజింగ్​ సీకర్స్​, అడ్వాన్స్​డ్​ ఏవియోనిక్స్​తో ఈ మిసైళ్లు ట్యాంకులను నాశనం చేస్తాయని చెబుతోంది. 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయని అంటోంది. ప్రస్తుతం ఆర్మీ దగ్గర ఉన్న మిలాన్​ 2టీ (2 కిలోమీటర్ల రేంజ్​), కోంకర్స్​ (4 కిలోమీటర్ల రేంజ్​) యాంటీ ట్యాంక్​ గైడెడ్​ మిసైళ్లు రాత్రిపూట పనిచేయలేవు. ఈ మిసైళ్లను భారత్​ డైనమిక్స్​ లిమిటెడ్​ తయారు చేసింది. రాత్రి పూట పనిచేయకపోవడం వల్ల కొత్త వాటిని ఆర్మీ తీసుకుంటోంది.

Latest Updates