చైనా బార్డర్‌లో మిస్సైల్ తో ఇండియన్ ఆర్మీ

లడఖ్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ మోహరించిన ఇండియా

లడఖ్: మన దేశం, చైనా మధ్య టెన్షన్లు తగ్గలేదు. రెండు దేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత… బార్డర్‌లో మామూలు పరిస్థితులు నెలకొన్నాయని అందరూ భావించారు. అయితే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) దగ్గర మాత్రం ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఎల్ఏసీ దగ్గర చైనీస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతుండటంతో మన దేశం కూడా అంతే ధీటుగా సై అంటోంది. ఈస్టర్ లడఖ్ లో మన దగ్గరి అత్యంత అడ్వాన్స్డ్ క్విక్ రియాక్షన్ సిస్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైల్ ను మోహరించింది. ఇది భూమి నుంచి గాలిలోని టార్గెట్స్ ను ఛేదిస్తుంది. చైనా ఫైటర్స్, చాపర్స్ ఎలాంటి దాడి చేసినా వాటిని నేలకూల్చే విధంగా మిస్సైల్ ను ఇక్కడకు తరలించారు. ” ప్రస్తుతం కొనసాగుతున్న టెన్షన్ల నడుమ మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలతో పాటు ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్ ను మోహరించాం. చైనా ఫైటర్స్, హెలికాప్టర్స్ నుంచి ఎలాంటి దాడులు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధం చేశాం ” అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. కొన్ని రోజులుగా ఎల్ఏసీ కి దాదాపు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఫైటర్స్, యుద్ధవిమానాలు, బాంబర్స్ ను వదిలే చాపర్స్ తో చైనా చక్కర్లు కొడుతోంది. దీంతో మన దేశం కూడా అలర్ట్ అయ్యింది. చైనా వైపు గల్వాన్‌‌ నది దగ్గర నల్లటి టార్ప్‌‌లైన్లు ఉన్నట్టు ఉపగ్రహ ఇమేజ్‌‌ ద్వారా తెలిసింది.

For More News..

చైనా ఫోన్లతో మనం పోటీ పడగలమా?

కోటి దాటిన కరోనా కేసులు

Latest Updates