కష్టాల్లో ఇండియన్ ఏవియేషన్ సెక్టార్

  • కరోనాతో మరింత నష్టపోతున్న ఇండస్ట్రీ
  •  భారీగా తగ్గనున్న ప్రయాణికులు
  •  చాలా కంపెనీలు మూతబడే ప్రమాదం

ఇండియన్‌‌ ఏవియేషన్ సెక్టార్‌ను ఎన్నడూ లేనన్ని కష్టాలు చుట్టుముట్టాయి. కరోనా ఎఫెక్ట్ ఎయిర్‌ క్ట్ లైన్‌‌ కంపెనీలను ఒక కుదుపు కుదిపేసింది. ఇండియాలో విమానాలన్నీ నేలకే పరిమితమయ్యాయి. బుక్ చేసుకున్న టికెట్లన్నీ క్యాన్సిల్ అయ్యాయి. సాధారణంగా అయితే క్యాన్సిల్డ్ టికెట్స్ కు పూర్తి రీఫండ్ ఇవ్వరు . కరోనా వల్ల విమానాలు నడపలేని పరిస్థితి కాబట్టి పూర్తి మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాల్సి వస్తోంది. దీంతో కంపెనీల వద్ద నగదు నిల్వలు అడుగంటుతు న్నాయి. పైగా విమానాలను ఎయిర్‌పోర్టుల్లో పార్క్ చేసినందుకు వేల డాలర్లు ఫీజుగా చెల్లించాలి.దీంతో ఏవియేషన్ సెక్టార్‌కు రోజురోజుకూ ఇబ్బందులు పె రుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అయితే ఇండిగో వంటి కంపెనీలు క్రెడిట్ సెల్ స్ట్రాటజీని అమలు చేస్తున్నాయి. ఈ విధానంలో రీఫండ్ మొత్తాన్ని కస్ట మర్లకు చెల్లించకుండా , తదనంతరం వాడుకునేలా క్రెడిట్‌నోట్స్ ఇస్తారు. క్యాన్సిల్డ్ టికెట్‌ను భవిష్యత్‌లో వేరే డెస్టినేషన్‌‌కు వెళ్లడానికి వాడుకునే సదుపాయాన్ని గోఎయిర్ కల్పించింది. అయితే దూరాన్ని బట్టి పెరిగే మొత్తాన్ని మాత్రం కస్టమరే భరించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డొమెస్టిక్ ప్రయాణికుల సంఖ్య పది కోట్లలోపే ఉంటుందని కాపా ఇండియా అనే సంస్థ స్టడీరిపోర్ట్ స్పష్టం చేసింది. అంటే ఇది ఐదేళ్ల కనిష్టం. 2015లో డొమెస్టిక్ ట్రావెలర్స్ సంఖ్య 8.1 కోట్లని డైరెకర్్ట జనరల్ ఆఫ్ ఏవియేషన్ (డీజీసీఏ) లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తేచాలా ఎయిర్‌లైన్ కంపెనీలకు మున్ముందు గట్టి సవాళ్లు ఎదురవడం ఖాయం.

కాపా రిపోర్ట్ ఇంకా ఏం చెబుతున్నదంటే..

..ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ పరిమాణం బాగాతగ్గుతుంది.బలమైన కంపెనీలే ఈ రంగంలో నిలబడగలుగుతాయి.

…కరోనాఎఫెక్ట్‌ముందు650 విమానాలు నడిచేవి.మెల్లమెల్లగాలాక్డౌన్‌నుఎత్తివేసినా అన్ని విమానాలూనడవడానికి కనీసం 12 నెలలుపడుతుంది.

…రాబోయేఆరు నెలల నుంచి ఏడాదివరకు 250 విమానాలు నిరుపయోగంగాపడి ఉంటాయి. ..ఇంటర్నేషనల్ ప్రయాణికుల సంఖ్య 2018– 19లో ఏడుకోట్లు కాగా, 2019–20ఆర్థిక సంవత్సరంలోఅది 3.5 కోట్లకుతగ్గింది…

…పైన పేర్కొన్నవన్నీ అంచనాలుమాత్రమే. లాక్ డౌన్ ను ఎత్తేయడం లేదాకొనసాగించడం జరిగితే పరిస్థితులు మారుతాయి.

Latest Updates