కెనడాలో కింగ్‌‌ మేకర్‌‌ మనోడే!

Indian-Canadian set to emerge as 'kingmaker' as Trudeau poised to form minority govt
  • జగ్మీత్‌‌సింగ్‌‌  పార్టీకి 24 సీట్లు
  • సర్కార్‌‌ ఏర్పాటుకు  లిబరల్‌‌ పార్టీకి 13 సీట్లు తక్కువ
  • ప్రధానిగా జస్టిన్ ట్రూడోకు చాన్స్‌‌

ఒట్టావా: కెనడా జనరల్‌‌ ఎన్నికల్లో   న్యూ డెమొక్రటిక్ పార్టీ లీడర్‌‌ (ఎన్డీపీ) చీఫ్‌‌,   ఇండియన్‌‌- కెనెడియన్‌‌ జగ్మీత్‌‌సింగ్‌‌  కింగ్‌‌మేకర్‌‌ కానున్నారు. 24  సీట్లు  గెలుచుకున్న ఎన్డీపీ కొత్త సర్కార్‌‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనుంది.  ప్రధాని జస్టిన్ ట్రూడో ఆధ్వర్యంలోని లిబరల్ పార్టీ  మరోసారి అధికారం దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హౌస్‌‌ ఆఫ్‌‌ కామన్స్‌‌లోని మొత్తం 388 సీట్లకు గాను  లిబరల్‌‌పార్టీ 157 సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ 121,  ది బ్లాక్‌‌ క్యూబెకోయిస్‌‌ 32, ఎన్డీపీ 24,  గ్రీన్‌‌పార్టీ 3, ఇండిపెండెంట్‌‌ ఒక సీటు గెలుచుకున్నారు. ఈసారి సర్కార్‌‌ ఏర్పాటుకు జస్టిన్ ట్రూడోకు మరో 13 మంది ఎంపీల  మద్దతు కావాల్సి ఉంటుంది.  దీంతో ఎన్డీపీ సపోర్ట్‌‌ లిబరల్స్‌‌కు తప్పనిసరయ్యే పరిస్థితి ఏర్పడింది.

2015తో పోల్చుకుంటే ఎన్డీపీకి సగం సీట్లు తగ్గాయి.  సీట్లు తగ్గినా  కెనడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి  కృషిచేస్తూనే ఉంటామని జగ్మీత్‌‌ సింగ్‌‌ మంగళవారం చెప్పారు. కొత్త పార్లమెంట్‌‌లో తమపార్టీ ‘‘నిర్మాణాత్మక’’ పాత్ర పోషిస్తుందని జగ్మీత్ సింగ్ అన్నారు.  40 ఏళ్ల  జగ్మీత్‌‌ సింగ్‌‌ ప్రధాని పదవికి పోటీపడ్డారు. లెఫ్టిస్ట్‌‌గా, క్రిమినల్‌‌ డిఫెన్స్‌‌ లాయర్‌‌గా ఆయనకు పేరుంది. మరోవైపు, లిబరల్‌‌ గవర్నమెంట్‌‌ 2015లో అధికారంలోకి వచ్చింది.  ఆ ఎన్నికల్లో ఇండియన్‌‌- కెనెడియన్లు 19 సీట్లు గెలుచుకున్నారు. వాళ్లలో 18 మంది పంజాబ్‌‌ సంతతికి చెందినవారే ఉన్నారు.  ట్రూడో ప్రభుత్వంలో నలుగురు సిక్కులు మంత్రులుగా  పనిచేశారు.

Latest Updates