బార్డర్ లో ఇండో–చైనా బెటాలియన్ల మధ్య ఘర్షణ

న్యూఢిల్లీ: ప్రపంచానికి కరోనా వైరస్ ను అంటగట్టిన చైనా.. తన వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదని మరోసారి నిరూపించుకుంది. చైనా సిబ్బంది ఇండియన్ ఆర్మీ బెటాలియన్ పై దూకుడుగా ప్రవర్తించడంతో బార్డర్ లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీనిపై మనదేశ ఆర్మీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇండో–చైనా బార్డర్ లోని సిక్కిం సెక్టార్‌ నకులా సమీపంలో ఇండియా, చైనా దళాలు ఘర్షణ పడ్డాయని ఆదివారం మీడియాకు తెలిపారు. రెండు వైపులా 150 మంది సైనికులు గొడవకు దిగారని, ఈ ఘటనలో నలుగురు మనవాళ్లు, ఏడుగురు చైనా సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. సీనియర్ల చిన్నపాటి చర్చతో గొడవ సర్దుమణిగిందని ప్రకటించారు. ‘‘ప్రొటోకాల్స్ ప్రకారం దళాలు ఇటువంటి సమస్యలను పరస్పరం పరిష్కరిస్తాయి. చాలా కాలం తర్వాత ఈ ఘటన జరిగింది”అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గొడవలను శాంతియుత వాతావరణంలో పరిష్కిరించుకోవాల్సి ఉన్నప్పటికీ.. చైనా మాత్రం తన బుద్ధి మార్చుకోలేదని కామెంట్ చేశారు.

Latest Updates