2,120మంది పాకిస్తాన్ పౌరులకు భారత పౌరసత్వం

గత నాలుగేళ్లలో 2,120మంది పాక్ పౌరులకు భారత పౌరసత్వం లభించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర హోమంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ 2017 నుండి 2020 సెప్టెంబర్ 17 వరకు 44 దేశాలకు చెందిన 2,729 మందికి భారత పౌరసత్వం ఇచ్చినట్లు వెల్లడించారు.

వారిలో పాక్ కు చెందిన 2,120 మందికి , ఆప్ఘనిస్తాన్ కు చెందిన 188మందికి, బంగ్లాదేశ్ కు చెందిన 99మందితో పాటు 60 మంది అమెరికన్లు, 58 మంది శ్రీలంక, 31 నేపాలీ, 20 యూకే , 19 మలేషియన్, 14 కెనడియన్ మరియు 13 సింగపూర్ పౌరులకు కూడా ఇదే కాలంలో భారత పౌరసత్వం లభించినట్లు కేంద్ర హోమంత్రి నిత్యానంద్ రాయ్ రాతపూర్వకంగా తెలిపారు.

Latest Updates