ఇండియన్‌ కోచ్‌‌‌ల శాలరీ క్యాప్ ఎత్తివేత

న్యూఢిల్లీ: సత్తా ఉన్న ఇండియన్​ కోచ్లకు మరింత చేయూతనిచ్చేందుకు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న రూ. 2 లక్షల శాలరీ క్యాప్ ను ఎత్తి వేసింది. మరింత బెటర్​ రిజల్ట్​ను రాబట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఈ పద్ధతిని తీసుకొచ్చింది. మాజీ ప్లేయర్లను కూడా కోచింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలన్నది కూడా దీని ప్రధాన ఉద్దేశం. వచ్చే ఏడాది సెప్టెంబర్​ 30 వరకు ఫారిన్​ కోచ్ల కాంట్రాక్స్ ట్ను ఎక్స్​టెండ్ చేసిన నేపథ్యంలో పై నిర్ణయం తీసుకుంది. ‘కొంత మంది ఇండియన్​ కోచ్లు మంచి రిజల్ట్​ చూపిస్తున్నారు. వాళ్ల హార్డ్ వర్క్ కు తగిన గుర్తింపు, రివార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలైట్ ప్లేయర్లకు కోచింగ్ ఇచ్చే విధంగా కంట్రీ వైడ్గా ఉన్న బెస్ట్​ కోచింగ్ టాలెంట్ను అట్రాక్ట్​ చేయాలని భావిస్తున్నాం. అందుకే శాలరీలపై ఎలాంటి పరిమితులు పెట్టకూడదని నిర్ణయించుకున్నాం. దీనివల్ల డిఫరెంట్ స్పోర్ట్స్ లో మంచి కోచ్ లు జాయిన్ అవుతారు’ అని స్పోర్ట్స్ మినిస్టర్​ కిరణ్ రిజిజు వెల్లడించారు.

 

Latest Updates