క్రికెట్ స్టార్ల కార్లు.. వాటి ప్రత్యేకతలు

మన క్రికెటర్లు క్రీజులోకి బ్యాటులో బౌండరీ బాదితే.. బాల్​ రయ్యిమని దూసుకెళ్లడం మనందరం ఎన్నో మ్యాచుల్లో చూశాం. బంతి వేశారంటే.. టాప్​ గేర్​లో వికెట్లను నేలకు పడగొడుతుంది. వాళ్లకు క్రికెట్టే సర్వస్వం. అయితే.. అప్పుడప్పుడు ఆటవిడుపుగా.. బ్యాటు, బాల్​ వదిలి.. గేర్​ మార్చి యాక్సిలేటర్​ తొక్కుతారు. స్టీరింగ్​ తిప్పుతూ.. రయ్యిమంటూ దూసుకుపోతారు. మన క్రికెటర్లు వాడే.. సూపర్​ కార్లేవో.. వాటి ఫీచర్లేంటో చూద్దామా!

మహేంద్రసింగ్​ ధోని

బాస్​ క్రీజులో ఉన్నాడంటే.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా.. ఈజీగా మార్చేస్తాడు. ప్రత్యర్ధులను బోల్తా కొట్టించే ఎత్తులతో మ్యాచ్ అవలీలగా చేతుల్లోకి తెచ్చుకోగల సమర్ధుడు డేరింగ్​, డాషింగ్​ధోని. భారత క్రికెట్​ జట్టును ప్రపంచంలోనే బెస్ట్​ టీమ్​గా నిలబెట్టిన ధోని దగ్గర కార్లు, బైకులు కలిపి ఓ గ్యారేజే ఉంది. కానీ.. బయటికెళ్తే మాత్రం ఎక్కువగా పోషే​ 911, హమ్మర్​ హెచ్​2 కార్లనే తీస్కెళ్తాడు. హమ్మర్​ కారులో ఉండే ఫీచర్లకు ధోని ఫిదా అయి ఆ కారును సొంతం చేసుకున్నాడు. ఈ కారు ట్యాంక్​ కెపాసిటీ 121 లీటర్లు. మైలేజీ లీటరుకు 5.1 కిలోమీటర్లు. 393 బీహెచ్​పీ పవర్​తో ఆరుగేర్లు ఒకదాని వెంట ఒకటి మారుస్తూ గాల్లో తేలిపోతాడు ధోని. పవర్​ఫుల్​ ఇంజిన్​ గల ఈ డీజిల్​ కారు మూడువేల కిలోలకు పైగా బరువుంటుంది. ఈ కారు లాక్స్​ బ్రేక్​ చేయడం ఎవరి తరం కాదు. ఎందుకంటే.. ఇందులో.. యాంటీ లాక్​ బ్రేకింగ్​ సిస్టమ్​ ఉంది. 8.20 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారుకు ధోని లాగే.. హార్స్​ పవర్​ ఎక్కువ. రెండు వరుసలలో ఐదుగురు కూర్చోవచ్చు. సైడ్​ మిర్రర్లు కూడా ఎలక్ట్రిక్​ వ్యూ టెక్నాలజీతో డిజైన్​ చేశారు. ఈ కారు ధర దాదాపు కోటి రూపాయలు. ఇక పోషే​ కారు విషయానికొస్తే.. దాని ధర రెండుకోట్ల వరకు ఉంటుంది. 2981 సీసీ ఇంజన్​తో లీటరుకు 11 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మూడు లీటర్ల ట్విన్​ టర్బోచార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​తో ఇది డిజైన్​ చేశారు.

విరాట్ కోహ్లీ
స్టైలిష్ లుక్ తో.. డేరింగ్ బ్యాటింగ్ తో తాజాగా వెస్టిండీస్ మీద టీ–ట్వంటీ, వన్డే, టెస్ట్ సిరీస్ లను క్లీన్ స్వీప్ చేశాడు కోహ్లీ. కెప్టెన్ గా జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ.. బెస్ట్ కెప్టెన్ అనిపించుకుంటున్నాడు. తన స్టైలిష్ లుక్ కి తగ్గట్టే.. తన కారు కూడా స్టైలిష్ గా సెలక్ట్ చేసుకున్నాడు కోహ్లీ. ఇంతకీ కోహ్లీ వాడే కారేంటో తెలుసా? ఆడి ఆర్ 8. కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునేలా డిజైన్ చేసిన ఈ కారును ఖాళీ టైమ్ లో అనుష్కతో కలిసి చక్కర్లు కొట్టడానికి ఇష్టపడి కొన్నాడేమో. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే.. పెట్రోల్ తో నడిచే ఈ కారు లీటరుకు 17.5 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ట్యాంక్ కెపాసిటీ 73 లీటర్లు. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్కింగ్ సె న్సర్లు అమర్చారు. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్ లైమెట్ కంట్రోల్ సిస్టమ్ తో ప్యాసింజర్ కి కూడా ఎయిర్ బ్యాగ్ ఫెసిలిటీతో ఈ కారు డిజైన్ చేశారు. ఏడు గేర్లతో గంటకు 330 కి లోమీటర్లు దూసుకెళ్లగల కెపాసిటీ ఈ కారుకు ఉంది. ఈ కారును ఎవరూ ఎత్తుకుపోకుండా యాంటీ థెఫ్ట్ అలారంతో రూపొందిం చారు. కోహ్లీలాగే స్టైల్ గా ఉండే ఈ కారు ధర ఎంతనుకుంటున్నారు.. జస్ట్ 2.8 కోట్లు మాత్రమే.

కేఎల్ రాహుల్

ఓపెనింగ్​ బ్యాటింగ్​తో గట్టి స్కోరుకు పునాదులు వేసే బ్యాట్స్​మెన్​ కేఎల్​ రాహుల్​. ఈ క్రికెటర్​ వాడే కారు పేరు మెర్సిడెస్​ ఏఎంజీ సి43.  తొమ్మిది గేర్లతో దూసుకుపోయే ఈ కారు లీటరుకు 14.5 కిలోమీర్ల మైలేజీ ఇస్తుంది. ఫ్యుయెల్​ కెపాసిటీ 66 లీటర్లు. గంటకు 250 కి.మీ స్పీడుతో దూసుకుపోగలదు. బ్రేక్​ అసిస్ట్​, హిల్​ అసిస్ట్​ వంటి ఫీచర్లతో కారు ప్రయాణిస్తున్న సమయంలో వాతావరణ మార్పులను పసిగట్టి కారులోని ఫీచర్లు అంటే ఏసీ, వీల్​ అలైన్​మెంట్​ వంటివి ఆటోమేటిగ్గా వాతావరణానికి అనుగుణంగా మార్చుకోగలదు. ఈ కారులో చైల్డ్​ సేఫ్టీ లాక్ సిస్టమ్​ కూడా ఉంది. సీట్​బెల్ట్​ పెట్టుకోనిదే ఒక్క ఇంచు కూడా కారు ముందుకు వెళ్లదు. జీపీఎస్​ నావిగేషన్​, ఫ్యూయెల్​ వార్నింగ్​ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. కారులో స్టీరింగ్​ని డ్రైవింగ్​కి అనుగుణంగా టిల్ట్​ చేసుకోవచ్చు.

శిఖర్ ధావన్

టీమ్​లో అందరూ సరదాగా ‘గబ్బర్​’ అని పిలుచుకునే శిఖర్​ ధావన్​కి ఇష్టమైన కారు మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​– క్లాస్​. డీజిల్​తో నడిచే ఈ కారు ట్యాంక్​ కెపాసిటీ 100 లీటర్లు. ఇంజిన్​ డిస్​ప్లేస్​మెంట్​ 2,987 సీసీ. డ్రైవర్​తో పాటు, ప్యాసింజర్లకు కూడా సేఫ్టీ ఎయిర్​బ్యాగ్స్​ ఈ కారు ప్రత్యేకత. మంచు కమ్మేసినప్పుడు యాక్టివ్​ అయ్యి రోడ్డు క్లియర్​గా కనిపించేందుకు ఫాగ్​ లైట్స్​ ముందుభాగంలో అమర్చి డిజైన్​ చేశారు. యాంటీ లాక్ బ్రేకింగ్​ సిస్టమ్​, యాంటీ థెఫ్ట్ అలారం, వెహికిల్​ స్టెబిలిటీ కంట్రోల్​ సిస్టమ్​, క్రాష్​ సెన్సార్​ వంటి అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

రోహిత్​ శర్మ

భారత క్రికెట్​ అమ్ముల పొదిలో ఈ హిట్​మ్యాన్​ ఆల్​టైమ్​ సూపర్​ హిట్టే. మినిమమ్​ వంద రన్నులు కొట్టనిది క్రీజులోంచి కదలని రోహిత్​శర్మ మెర్సిడెజ్​ బెంజ్​ కారును ముచ్చటపడి కొనుక్కున్నాడు. ఇది మాత్రమే కాదు.. రోహిత్​ దగ్గర ఇంకా ఆడి, బీఎండబ్ల్యూ కార్లు కూడా ఉన్నాయి. ఎక్కువగా రోహిత్​ ఈ కార్లోనే బయటకు వెళ్తాడు. ఐడియల్​ స్టీరింగ్​ పవర్​తో కరెంట్​ డ్రైవింగ్​ స్పీడును ఈ కారు కంట్రోల్​ చేస్తుంది. లీటర్​కు 9.5 మైలేజీతో ఆటోమేటిక్​ గేర్లతో ఈ కారు దూసుకుపోతుంది. ఇంజిన్​ హార్స్​ పవర్​ 591.3. ఈ కారు ట్యాంక్​ కెపాసిటీ 68 లీటర్లు. కారులోని మరిన్ని ఫీచర్లు ఏంటంటే.. క్లైమెట్​ కంట్రోల్​, ఎయిర్​ క్వాలిటీ కంట్రోల్, స్మార్ట్​ యాక్సెస్​ ఎంట్రీ, టచ్​స్క్రీన్​ డిస్​ప్లే, ఇంజిన్​ బటన్​, ఫ్రంట్​లో పవర్​ విండోస్​, ప్యాసింజర్​ ఎయిర్​బ్యాగ్, యాంటీ లాక్​ బ్రేకింగ్​ సిస్టమ్​, గంటకు 250 కిలోమీటర్లు ఈ కారు దూసుకుపోతుంది. ఈ కారు ధర ఎంతో తెలుసా? కోటిన్నర రూపాయలు.

హర్భజన్ సింగ్

వికెట్​ పడగానే..‘హే.. భల్లే.. భల్లే’ అంటూ డ్యాన్స్​ చేసి.. టీమ్​లో ఉన్నన్ని రోజులు మంచి పెర్​ఫార్మెన్స్​ ఇచ్చిన మన బజ్జీకి హమ్మర్​ హెచ్​2, మెర్సిడెజ్​ బెంజ్​ క్లాస్​ కార్లంటే చాలా ఇష్టం. ఆ రెండు కార్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. బజ్జీ దిగే ఫొటోల్లో హమ్మర్​ హెచ్​2 కార్​ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ కారు ధర కోటి రూపాయల వరకు ఉంది. 121 ఫ్యుయెల్​ కెపాసిటీతో రయ్యిన దూసుకెళ్తుంది ఈ కారు. ఈ కారు బరువు దాదాపు 3,900 కిలోలు. పవర్​ఫుల్​ స్టీరింగ్​, రిమోట్​ ఎంట్రీ, పవర్​ విండోస్ వంటి ఫీచర్లతో ఈ  కారు రూపొందించారు. స్టీరింగ్​ను టిల్ట్​ చేసుకోవచ్చు. యాంటీ థెఫ్ట్​ అలారం, చైల్డ్​ ప్రొటెక్షన్​ లాక్​ టెక్నాలజీతో అలరించే ఈ కారంటే బజ్జీకి చాలా ఇష్టం.

హార్దిక్ పాండ్యా

అటు బౌలింగ్​, ఇటు బ్యాటింగ్​లో చిచ్చరపిడుగులా చెలరేగిపోయి ఆడే హర్దిక్​ పాండ్యా తనలాగే.. రోడ్డు మీద రెచ్చిపోయి దూసుకుపోయే కారు వాడుతున్నాడు. దాని పేరు.. లాంబర్గినీ హరికేన్. పేరు చూస్తుంటే.. సేమ్​ హార్ధిక్​ పాండ్యా బ్యాటింగ్​ తీరులాగే అనిపిస్తుంది కదా! ఏడు గేర్లతో ఈ కారు ఒక్కసారి రోడ్డు మీదికి ఎక్కిందంటే.. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 90 లీటర్లు దీని ట్యాంక్​ కెపాసిటీ. కేవలం మూడున్నర సెకన్లలో వంద కిలోమీటర్ల స్పీడు అందుకోగలదు. 5204 సీసీ ఇంజిన్​తో రేసు కార్లలో అత్యుత్తమమైన వాటిలో ఇదొకటి. బ్రేక్​ అసిస్ట్​, హిల్​ అసిస్ట్​, ఎలక్ట్రానిక్​ బ్రేక్​ ఫోర్స్​ డిస్ట్రిబ్యూషన్​, ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ ప్రోగ్రామ్​, ఆటోమేటిక్​ హెడ్​ల్యాంప్​ వంటి అధునాతన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. కారులో ప్రయాణించే అందరికీ ఎయిర్​బ్యాగ్స్​ ఉండడం ఈ కారు ప్రత్యేకత. ఈ కారు ధరెంతో తెలుసా?  అక్షరాలా నాలుగు కోట్ల రూపాయలు.

సురేష్ రైనా

గ్రౌండులో మెరుపులా కదిలే సురేష్​ రైనా.. తన కారు కూడా రోడ్డు మీద మెరుపులా మెరిసేదే కొనుక్కున్నాడు. ఆ కారు పేరు పోషే 718 బాక్స్​టర్​.  ఇది 2.0 పెట్రోల్​ ఇంజిన్​ మోడల్​. ఏడు గేర్లతో గంటకు 275 కిలోమీటర్లు దూసుకుపోగలదు.  1988 ఇంజిన్​ సామర్థ్యం. పెట్రోల్​తో నడిచే ఈ కారు లీటర్​ పెట్రోలుకు 14.4 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.  ట్యాంక్​ కెపాసిటీ 54 లీటర్లు. కేవలం ఇద్దరు మాత్రమే ఈ కారులో ప్రయాణించగలరు. ఈ కారులో ప్యాసింజర్​ ఎయిర్​బ్యాగ్స్​తో పాటు సైడ్​ ఎయిర్​బ్యాగ్స్​ ఫెసిలిటీ కూడా ఉంది. వాతావరణానికి తగ్గట్టుగా ఏసీ దానంతట అదే.. అడ్జస్ట్​ అవుతుంది. సింగిల్ ఇంజిన్​ బటన్​. తాళంచెవి లేకుండానే స్మార్ట్​గా ఈ కారులోకి ఎంట్రీ కావచ్చు.  సీట్​బెల్ట్ లేకపోయినా, యావరేజ్​ ఫ్యుయెల్​ లేకపోయినా, డోర్​ సరిగ్గా వేసుకోకపోయినా కారు ఇంచు కూడా ముందుకు కదలదు.

యువరాజ్ సింగ్

ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో ఇంగ్లాండ్​కి చుక్కలు చూపించి.. క్యాన్సర్​తో పోరాడి జయించిన​ డేరింగ్​, డాషింగ్​ క్రికెటర్​ యువరాజ్​సింగ్​. యువీకి కూడా రేసింగ్​ అంటే చాలా ఇష్టం. అందుకే.. ఏరి కోరి మరీ రేసింగ్​ కారు కొనుక్కున్నాడు. దాని పేరు లాంబర్గినీ ముర్సిలాగో. వందలీటర్ల ఫ్యుయెల్​ కెపాసిటీతో  గంటకు 340 కిలోమీటర్లు దూసుకుపోగలదు. లీటరుపెట్రోలుకు 4.8 కి.మీ మైలేజ్​ ఇస్తుంది ఈ కారు. దీని ధర మూడున్నర కోట్ల రూపాయలు. పక్షి రెక్కల్లా ఈ కారు డోర్లు పైకి తెరుచుకుంటాయి. వేగంగా ఈ కారు రోడ్డు మీద దూసుకుపోతుంటే.. అచ్చం ఫీనిక్స్​ పక్షి ఎగురుకుంటూ పోయినట్టే ఉంటుంది. యాంటీ లాక్​ బ్రేకింగ్​ సిస్టమ్​, సెంట్రల్​ లాకింగ్​, పవర్​ డోర్​ లాక్స్​, ప్యాసింజర్​ అండ్ సైడ్​ ఎయిర్​బ్యాగ్స్​ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.

Latest Updates