ఈ సారి గట్టిగా కొట్టాలె: టీమిండియా ప్రాక్టీస్ షురూ

హిమాచల్‌ ప్రదేశ్‌: న్యూజిలాండ్ తో వరుస ఓటమిల తర్వాత జరిగే సౌతాఫ్రికా వన్డే సిరీస్ పై కన్నేసింది భారత్. ఈ సిరీస్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది కోహ్లీ సేన. ఈ క్రమంలోనే భారత క్రికెటర్లు ధర్మశాల స్టేడియంలో గట్టిగా ప్రాక్టీసు చేస్తున్నారు. మంగళవారం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహా టీమ్ ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌ లో పాల్గొన్నారు.

టీమిండియా సొంత గడ్డపై సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్‌ ఆడనున్నది. ఫస్ట్ వన్డే మార్చి 12న ధర్మశాలలో జరుగనుంది. 15న లక్నోలో రెండో వన్డే, మూడో వన్డే 18న కలకత్తాలో జరగనున్నాయి. ఈ 3 మ్యాచ్‌ లు డే-నైట్‌ మ్యాచ్‌లే. మధ్యాహ్నం 1-30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

See Also: రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై ముగిసిన విచారణ

Latest Updates