పరిశోధకులవుతున్న ఇండియన్‌‌‌‌ రైతులు

Indian farmers becomes Citizen scientists through CGIAR
  • కొత్త విత్తనాలను పండించేందుకు ఆసక్తి
  • వాటిల్లో ఏది బెస్టో సైంటిస్టులకు వివరాలు
  • సీజీఐఏఆర్‌‌‌‌ ‘ట్రైకాట్‌‌‌‌’కు మంచి స్పందన

ఇండియన్‌ రైతులు సిటిజన్‌ సైంటిస్టులవుతున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త విత్తనాలకు సృష్టికర్తలవుతున్నారు. ఎలాంటి వాతావరణంలో ఎలాంటి విత్తనాలైతే దిగుబడి ఎక్కువిస్తాయో ఈజీగా చెప్పేస్తున్నారు. కన్సార్షియం ఆఫ్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ అగ్రికల్చరల్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ (సీజీఐఏఆర్‌‌‌‌)మొదలుపెట్టిన ‘ట్రైకాట్ ట్రయాడిక్‌‌‌‌’ పద్ధతిని అక్కున చేర్చుకొని అద్భుతాలు చేస్తున్నారు.

పంటతో పాటే ప్రయోగం

సీజీఐఏఆర్‌‌‌‌..రీసెర్చ్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌ ఆన్‌ క్లైమేట్‌‌‌‌ చేంజ్,అగ్రికల్చర్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ సెక్యూరిటీలో భాగంగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇండియా, నికరాగ్వా, ఇథియోపియాల్లో రకరకాల భూములు, వాతావరణ పరిస్థితులు, సీజన్లుండే ప్రాంతాల్లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు.ఇందులో భాగంగా రైతులకు మూడు రకాల విత్తనాలిచ్చారు. నికరాగ్వాలో 842 పంట పొలాలకు కామన్‌బీన్స్‌‌‌‌, ఇథియోపియాలో 1,090 డురుమ్‌‌‌‌ వీట్‌‌‌‌,ఇండియాలో 10,477 పొలాలకు బ్రెడ్‌‌‌‌ వీట్‌‌‌‌ విత్తనాలను పంచారు. 2012 నుంచి 2016 మధ్య ఈ ట్రయల్స్‌‌‌‌ నడిచాయి. ఇథియోపియాలో మూడు పంటలు, నికరాగ్వాలో ఐదు, ఇండియాలో నాలుగు సీజన్లలో ఈ పంటలు పండించారు. సాధారణ పంటలతో పాటే ఈకొత్త విత్తనాలనూ కొం త భూమిలోనే  పండించారు. పంట పెరిగే సమయం, దిగుబడి, నాణ్యత ప్రకారం విత్తనాల వివరాలను సైంటిస్టులకు పంపించా రు.

రైతులైతేనే బెటర్‌

‌‌‌రైతుల నుంచి తీసుకున్న డేటాను నేల, వాతావరణం,సీజన్‌ ప్రకారం వేరు చేసి సైంటిస్టులు పరిశీలించారు.విత్తనాలు నాటాక రైతులతో జీపీఎస్‌‌‌‌ ద్వారా టచ్‌‌‌‌లోఉన్నారు. వాతావరణానికి సంబంధిం చిన సమాచారాన్ని వెదర్‌‌‌‌ స్టేషన్లు, శాటిలైట్ల ద్వారా తీసుకున్నారు.ఇలాం టి కొత్త విత్తన పరిశోధనల్లో రైతులను భాగస్వాము లు చేస్తే మంచి ఫలితాలొస్తాయని సైంటిస్టులు అంటున్నారు. విత్తనాలను వాడేది రైతులేనని,విత్తినప్పటి నుంచి ఉత్పత్తి వరకు విత్తనాన్ని దగ్గరినుంచి చూస్తారని, తమ లోకల్‌‌‌‌ పరిస్థితులకు ఎలాంటి విత్తనాలు అవసరమో వాళ్లకే తెలుసని చెబుతున్నారు.

రకరకాల పరిస్థితులు, రకరకాల విత్తనాలు

నికరాగ్వాలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువ. అక్కడ బీన్‌ విత్తనాల పెంపకాన్ని పరిశీలించా రు. ఇథియోపియాలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ. అక్కడ గోధుమల దిగుబడిని చూశారు. సీజన్‌ ను బట్టి ఉష్ణోగ్రతలు మారే ఇండియాలో బ్రెడ్‌‌‌‌ వీట్‌‌‌‌ను రైతులకు పంచారు.రోజువారీ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే వాతావరణం మేఘావృతమై ఉంటుందని, వేడి తక్కువగా ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని విత్తనాలు బాగా పెరుగుతాయని సైంటిస్టులు చెప్పారు. మరికొన్ని విత్తనాలు ఉష్ణోగ్రతలు ఎక్కువున్నపుడు దిగుబడి ఎక్కువిస్తాయని వివరించారు. ఇండియాలో వచ్చిన డేటాను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌‌‌‌ ఫర్‌‌‌‌ వీట్‌‌‌‌ అండ్‌‌‌‌ బార్లీ రీసెర్చ్‌‌‌‌ డేటాతో పోల్చి చూశామని చెప్పారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో డబుల్‌‌‌‌ డ్వార్ఫ్‌‌‌‌ వీట్‌‌‌‌ రకం హెచ్‌‌‌‌డీ 2967 బాగా దిగుబడినిచ్చిం దని, ట్రైకాట్‌ ‌‌‌ ట్రయల్‌‌‌‌లోఈ విత్తనాన్నే ఐఐడబ్లూ బీఆర్‌‌‌‌ సూపర్‌‌‌‌ వంగడంగా గుర్తించిందని తెలిపారు. ఎప్పుడో 1996లో ప్రవేశపెట్టిన పాత విత్తనం కే 9107 కూడా మంచి దిగుబడినిచ్చిందని చెప్పారు. 2017 ఏప్రిల్‌‌‌‌లో చేసిన ఓ సర్వే ప్రకారం బీహార్‌‌‌‌లోని సమస్తిపూర్‌‌‌‌లో 83 శాతం,ఛప్రా, వైశాలిల్లో 95 శాతం మంది రైతులు విత్తనాలు తీసుకోడానికి ముందుకొచ్చారని చెప్పారు. పంటల్లో 30 శాతం దిగుబడి పెరిగిందని వెల్లడించారు.

మెల్లిమెల్లిగా మహిళలూ..

ట్రయల్‌‌‌‌ చేస్తున్నప్పుడు ఎదురు దెబ్బలూ తగిలాయని సైంటిస్టులు అంటున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు ఆలస్యంగా వచ్చాయని, అయినా వేసిన పంటలను తొలగించడానికి రైతులు ముందుకొచ్చారని తెలిపారు. మహిళలను ఈప్రయోగంలో భాగస్వాములు చేయడం కష్టమైందని అన్నారు. తొలి ఏడాది కొంతమందే ముం దుకొచ్చారని తెలిపారు. చాలా ప్రాంతాల్లో మగ వారే ఎక్కు వ ఆసక్తి చూపించారన్నారు. ప్రయోగంలో మగవారి పార్టిసిపేషన్‌ కూడా అవసరమైనా స్త్రీలు ఆహారం వండుతుం టారు కాబట్టి విత్తనాలు, పంటపై వారి దృష్టి మరోలా ఉంటుందని వివరించారు. ఎక్కువ మంది మహిళలను భాగస్వాములు చేయడానికి స్వయం సహాయక బృందాల సాయం తీసుకున్నామని చెప్పా రు.

Latest Updates