మరో ఆత్మాహుతికి జైషే రెడీ.. అందుకే అందరినీ లేపేశాం

Pokలో జరిగిన దాడిపై భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ కేశవ్ గోఖలే మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదును టార్గెట్ చేస్తూ దాడులు జరిపామని తెలిపారు.ఈ ఘటన పాక్ లోని బాలాకోట్ వద్ద దాడి చేశామన్నారు.  ఉగ్రవాదుల శిబిరాలు మొత్తం హిల్ స్టేషన్ లో ఉన్నాయని వాటిని మాత్రమే మట్టుబెట్టామని చెప్పారు. సామాన్య ప్రజలకు ఏమాత్రం హాని కలగకుండా దాడి జరిందని తెలిపారు.

జైషే మహమ్మద్ చీఫ్ మహమ్మద్  హజార్ బావ మౌళానా యూసూఫ్ అజర్ అలియాస్ ఉస్తాద్ గౌరి నేతృత్వంలో ఉగ్రవాదులు ట్రేనింగ్ అవుతున్నారని విజయ్ గోఖలే చెప్పారు. వీరిని టార్గెట్ చేస్తూనే దాడులు జరిపామన్నారు. ఈ దాడిలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు, ట్రైనర్స్, సీనియర్ కమాండర్స్, జీహాదీలు హతమయ్యారని చెప్పారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 300 మంది ఉగ్రవాదులు హతం అయ్యారని తెలుస్తుంది.

జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మరో ఆత్మాహుతి దాడి జరుపనున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని విజయ్ గోఖలే చెప్పారు. ఇందుకు ఫిదాయిన్ ఉగ్రవాదులు కెటాయింపబడ్డారని  తెలిపారు.

Latest Updates