అదృష్టం అంటే ఈ అమ్మాయిదే : రెండుసార్లు జాక్ పాట్ కొట్టిన భారత బాలిక

అదృష్టం పరీక్షించుకునే ముందు కొంతమంది తమ పిల్లల పేర్లను వాడుకుంటారు. వ్యాపారం..లాటరీ..ఉద్యోగాల్లో కలిసిరావాలని బిడ్డల పేర్లు చెబుతుంటారు. ఇలాగే కూతురి పేరు వాడుకున్న ఓ తండ్రి కోటీశ్వరుడయ్యాడు. ఈ విషయం తెలిస్తే అతడికి అదృష్టం ఆ అమ్మాయ రూపంలో వచ్చిందా అనకతప్పదు. ఆ బాలిక మూడేళ్ల వయసులోఓ లగ్జరీ కారు గెలుచుకుంది. ఇప్పుడు 9 ఏళ్ల వయస్సు రూ.7 కోట్లు (1 మిలియన్ డాలర్) లాటరీ గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులోని టెర్మినల్ 3లో కాన్‌ కోర్స్ బీ ఆవరణలో ఈ డ్రా నిర్వహించారు. 298వ 1 మిలియన్ డాలర్ లాటరీ ఈవెంట్‌ లో ఆ అమ్మాయిని విజేతగా ప్రకటించారు.

దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్‌ లో జాక్‌పాట్ కొట్టేసిన ఆ అమ్మాయి పేరు ఎలీజా ఎం. భారత సంతతికి చెందిన అమ్మాయి. ఎలీజా వయస్సు మూడేళ్లు ఉన్నప్పుడు మెక్‌ లారెన్ కూప్ 1513 సిరీస్ లాటరీలో 1867 టికెట్ నెంబర్‌పై లగ్జరీ కారు గెలుచుకుంది. ఇప్పుడు 0333 నెంబర్‌పై జాక్‌పాట్ కొట్టేసింది. ఎలీజా తండ్రి ముంబైవాసి. 19 ఏళ్లుగా దుబాయ్‌ లో ఉంటున్నాడు. 15 ఏళ్లుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనేర్ ప్రమోషన్‌లో ఏళ్లుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

ప్రతీ సిరీస్‌ కు లాటరీ టికెట్లు కొంటుంటాడు. 9 లక్కీ నెంబర్ కావడంతో 9 కలిసొచ్చేలా ఈసారి 0333 నెంబర్‌ ను తన కూతురు పేరు మీద ఆన్‌ లైన్‌ లో తీసుకున్నాడు. ఆ నెంబర్‌కే రూ.7 కోట్ల లాటరీ తగిలింది. 1999 నుంచి దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనేర్ ప్రమోషన్‌ కొనసాగుతోంది. రెండు దశాబ్దాలుగా మిలియన్ డాలర్‌ను 140 మంది భారతీయులు గెలుచుకోవడం విశేషం. ఎవ్వరూ ఊహించనా లాటరీ కొట్టినందుకు ఆ అమ్మాయి పేరు దుబాయ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Latest Updates