పాక్ నుంచి వచ్చేసిన భారత హై కమిషనర్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ లో భారత హైకమిషనర్ గా విధుల్లో ఉన్న అజయ్ బిస్రాయ్ వెనక్కి వచ్చేశారు. పుల్వామా దాడి నేపథ్యంలో ఆయన భారత్ కు తిరిగి వచ్చారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన నేరుగా విదేశాంగ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.

భారత బలగాలు ప్రతికార దాడికి సిద్ధపడుతున్న క్రమంలో దీనిపై ఉన్నతాధికారులతో ఆయన భేటీ అవుతున్నారు. వ్యూహాత్మకంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై విదేశాంగ, రక్షణ శాఖ అధికారులతో చర్చించే అవకాశం ఉంది.

పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే మహ్మద్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి 40 మంది వీర జవాన్లను పొట్టనబెట్టుకుంది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యం సిద్ధమవుతోంది. మరోవైపు ఇప్పటికే విదేశాంగ శాఖ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. ప్రపంచంలో పాక్ ను ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. పాక్ కు గతంలో ఇచ్చిన మోస్ట ఫేవర్డ్ నేషన్ హోదాను తొలగించి తొలి దెబ్బ కొట్టింది.

Latest Updates