భారత హాకీ ఆటగాడు మన్‌దీప్ ‌సింగ్‌కు కరోనా

దేశంలో రోజురోజుకు క‌రోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. జాతీయ హాకీ జట్టులో ఈ వైర‌స్ మ‌హ‌మ్మారి క‌లకలం రేపుతోంది. గతంలో కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌తో సహా మరో ఐదుగురు జట్టు సభ్యులకు సోకిన క‌రోనా వైర‌స్.. తాజాగా మ‌రో ఆటగాడు మన్‌దీప్‌సింగ్ కు కూడా సోకింది. బెంగళూరు స్పోర్స్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఏఐ)లోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్ద జరిగిన జాతీయ శిబిరంలో 20 మంది ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయగా అందులో మన్‌దీప్‌సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఎస్‌ఏఐ సోమవారం వెల్ల‌డించింది. అయితే అతడికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నాడని తెలిపింది. మరో ఐదుగురికి కూడా డాక్ట‌ర్లు చికిత్స అందిస్తున్నట్టు ఎస్ఏఐ ఓ ప్రకటనలో తెలిపింది.

Latest Updates