ఇండియాదే హాకీ టైటిల్‌

కాన్‌‌బెర్రా: మూడు దేశాల హాకీ టోర్నమెంట్‌‌ టైటిల్‌‌ను ఇండియా జూనియర్‌‌ విమెన్స్‌‌ టీమ్‌‌ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌‌లో ఇండియా 1–2తో ఆస్ట్రేలియాతో చేతిలో ఓడింది. అయితే టోర్నీలో నాలుగు మ్యాచ్‌‌లు ఆడిన ఇండియా 7 పాయింట్లతో టాప్‌‌ పొజిషన్‌‌లో నిలిచి టైటిల్‌‌ను సాధించింది. గోల్‌‌ తేడాతో ఆసీస్‌‌ రెండో స్థానంలో నిలవగా, న్యూజిలాండ్‌‌ 3  పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆసీస్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా ఆరంభంలో మెరుగ్గా ఆడినా ఆఖర్లో చతికిలపడింది. ఇండియా తరఫున గగన్‌‌దీప్‌‌ కౌర్‌‌ (53వ ని.) ఏకైక గోల్‌‌ చేసింది. అబిగలి విల్సన్‌‌ (15, 56వ ని.) డబుల్ గోల్స్‌‌తో ఆసీస్‌‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో ఇండియాకు ఇది తొలి పరాజయం.

Latest Updates