ఈజిప్టులో రోడ్డు ప్రమాదం..ఇండియన్ తో సహా ఆరుగురు మృతి

ఈజిప్టులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు ట్రక్కును ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక భారతీయుడు సహా ఆరు మంది మృతి చెందారు 20 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సులు బీచ్-రిసార్ట్ పట్టణం  నుంచి హుర్ఘాడాకు వెళుతుండగా వాటిలో ఒకటి సోఖ్నా-జఫరానా రోడ్‌లో ట్రక్కును ఢీ కొట్టాయి. బస్సులో 16 మంది టూరిస్టులు ఉన్నారు.

 మృతుల్లో ఒకరు ఇండియన్ , ఇద్దరు మలేషియన్లు, ముగ్గురు ఈజిప్షియన్లు ఉన్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు అక్కడి అధికారులు.  ఎంబసీ అధికారులు సూయెజ్ నగరం, కైరోలోని ఆసుపత్రులలో ఉన్నారు. హెల్ప్‌లైన్ నంబర్లు + 20-1211299905 , + 20-1283487779 అందుబాటులో ఉన్నాయని ట్వీట్ చేశారు.

Latest Updates