పేరు శివంగి: నావికాదళంలో మొదటి మహిళా పైలెట్

భారత నావికాదళంలో మొదటి మహిళా పైలెట్ గా బాధ్యతలు స్వీకరించారు సబ్-లెఫ్టినెంట్ శివంగి. ట్రైనింగ్ పీరియడ్ ముగించుకున్న ఆమె ఈరోజు కొచ్చిలో డ్యూటీ జాయిన్ అయ్యారు. శివంగి సొంత ఊరు బీహార్ లోని ముజఫ్పర్ పూర్. ఆమె తన స్కూలింగ్ ను DAV పబ్లిక్ స్కూల్ లో చేసింది. 2018లో శివంగి నేవీలో తన మొదటి దశ ట్రైనింగ్ ను పూర్తిచేసింది. శివంగి మాట్లాడుతూ.. చాలా రోజులనుంచి ఎదురు చూసిన క్షణం ఇప్పుడు ఎదురైందని అన్నారు. చివరి దశ ట్రైనింగ్ పూర్తిచేసుకోవడానికి ఆరాటపడుతున్నట్లు చెప్పారు. ఈ రోజు కిచ్చిలో డ్యూటీ జాయిన్ అయిన శివంగి.. నావికాదళ నిఘా విమానంలో దేశ సరిహద్దు వద్ద కాపలా కాయనుంది.

Latest Updates