గ్యాస్‌ బుకింగ్‌ చేసుకున్న రోజే సిలిండర్‌ డెలివరీ

గ్యాస్‌ వినియోగదారులు సిలిండర్ కోసం ఇబ్బందులు పడకుండా సంచలన నిర్ణయం తీసుకుంది ఇండేన్‌. గ్యాస్‌ బుకింగ్‌ చేసుకున్న మొదటి రోజే వంట గ్యాస్‌ డెలివరీ చేసే విధంగా సేవ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC).

ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ఒక నగరం లేదా జిల్లాకు తత్కాల్‌ LPG సేవలు ప్రారంభించనుంది. ఈ తత్కాల్‌ పథకం సేవల కింద బుక్‌ చేసుకున్న అర గంట… నలభై ఐదు నిమిషాల్లో కస్టమర్‌కు గ్యాస్‌ డెలివరీ చేయనున్నట్లు IOC అధికారులు తెలిపారు. అయితే ఈ సేవలను ఖరారు చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తత్కాల్‌ వంట గ్యాస్‌ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఇండేన్‌ బ్రాండ్‌ ద్వారా IOC వంట గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేస్తోంది. మొత్తం 28 కోట్ల డొమెస్టిక్‌ LPG కన్జ్యూమర్లలో ఇండేన్‌ గ్యాస్‌ 14 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది. 2010లోను నాటి మంత్రి ఎల్‌పిజి డెలివరీ స్కీమ్‌ ను ప్రారంభించారు. ఈ స్కీం ప్రకారం కస్టమర్‌ గ్యాస్‌ సిలిండర్‌ను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు సప్లై చేసేలా డిమాండ్‌ చేయవచ్చు.

Latest Updates