చిన్నోడే కానీ చిచ్చర పిడుగు.12 ఏళ్లకే సొంతగా కంపెనీ

ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ సంధు.. బయటి ప్రపంచంలో, సోషల్ మీడియాలో తనకంటూ ఓపేరు తెచ్చుకున్న కుర్రాడు. పేరుకు తగ్గట్టే అతడుపెట్టుకున్న లక్ష్యాలు అలాంటివి మరి. ఆ లక్ష్యాన్నిచేరుకోవడం కోసం.. చిన్న వయసులోనే ఎవరూ చేయలేని సాహసాన్ని చేశాడు. సొంతంగా కంపెనీ పెట్టుకోవాలని కలగనే వాళ్ల కోసం.. వాళ్ల కలలను తీర్చే అడ్వైజర్ గా మారాలనుకున్నాడు. 12 ఏళ్లకే అకౌంటెన్సీ సంస్థను పెట్టేశాడు. తన సాయం కోరివచ్చే వాళ్లకు తన వంతు సహకారం అందిస్తాడు.ఫ్రీగా ఏం కాదు. గంటకు 12 పౌండ్ల (సుమారు₹1100) నుం చి 15 పౌండ్ల (₹1400) వరకు చార్జ్ చేస్తాడు. స్కూలు, బిజినెస్ ను ఒకేసారి చూసుకోవడం తనకు పెద్ద కష్టమేం కాదని అంటున్నాడు ఈచిన్నోడు.

25 ఏళ్లు వచ్చేటప్పటికి తన బిజినెస్ ను విస్తరిం చి కోటీశ్వరుడు కావాలన్నదే తన కలని కరాఖండిగా చెప్పేస్తున్నాడు. ఆన్ లైన్ అకౌంటిం గ్కోర్సును పూర్తి చేసిన రణ్ వీర్ సింగ్ , లెవెల్ 3సీపీడీ బేసిక్ అకౌంటిం గ్ సర్టిఫికెట్ ను కూడాసంపాదిం చేశాడు. 2016 జూన్ లో డిజిటల్ అకౌంటెన్సీ అనే సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత రెండేళ్లకే రెండో సంస్థనూ పెట్టాడు. ప్రస్తుతం దానినిడెవలప్ చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాడు. ఇంటినుం చే పని చేస్తాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినాఒక ఫోన్ చేయండి చాలు.. 30 నిమిషాల పాటుఫ్రీ సర్వీస్ ఇస్తా అంటున్నాడు. తన కల మొదటినుంచి తన తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం అందించారని చెప్పాడు.

కంపెనీని ప్రపంచ స్థాయికంపెనీగా మార్చి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ డబ్బు సంపాదించడమే తన ముందున్నపెద్ద లక్ష్యమంటున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్​ రాగానే ఇప్పటిదాకా సంపాదించిన డబ్బుతో సొంతంగా కారు కొనుక్కునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్​ చేసి తనసామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు బాటలు వేసుకుంటున్నాడు.

కంపెనీని పెట్టడమే కాదు..క్లయింట్ల అకౌంట్లు చూసుకునేందుకు తానేసొంతంగా ఓ సాఫ్ట్​వేర్ నూ తయారు చేశాడు. చిన్నవయసులోనే కొన్ని అవార్డులను మూట కట్టేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం నిర్వహించిన అల్ట్రా ఎడ్యుకేషన్ కిడ్స్​ బిజినెస్ అవార్డ్స్ లోటెక్ బిజినెస్ ఆఫ్ ద ఇయర్ ప్రైజును సొంతం చేసుకున్నాడు. దాం తో పాటు మరికొన్ని అవార్డులనూ ఒడిసి పట్టాడు.

పేరు: రణ్ వీర్ సింగ్ సంధు

వయసు: 15 ఏళ్లు

తల్లిదండ్రులు: తండ్రి అమన్ సింగ్ సంధు (50). ఓ బిల్డర్ . తల్లి దల్వీందర్ కౌర్ (45).

రియల్ ఎస్టేట్ ఏజెంట్ .

గోల్ : 25 ఏళ్ల కల్లా కోటీశ్వరుడు కావాలని కల

మరి, ఏం చేస్తున్నడు: స్కూల్లో చదువుకుంటూనే 12 ఏళ్ల వయసులోనే సొంతంగా అకౌంటెన్సీ

సంస్థను పెట్టాడు.

సంస్థ పేరు: డిజిట్ అకౌంట్స్

​ఫలితం: ఇప్పటికే పది మంది క్లయింట్లను సంపాదించాడు.

గొప్పేంటో: బ్రిటన్ లో యువ అకౌంటెంట్ గా క్రెడిట్ కొట్టేయడం.

ఉండేదెక్కడ?: సొంత దేశం ఇండియానే అయినా.. బ్రిటన్ లో సెటిలైంది అతడి ఫ్యామిలీ. ప్రస్తుతం దక్షిణ

లండన్ లో ఉంటున్నారు.

Latest Updates