కరోనా లక్షణాలతో వైరాలజిస్ట్ గీత మృతి

దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ బారిన పడి భారత సంతతి వైరాలజీ శాస్త్రవేత్త  చనిపోయారు. వారం క్రితమే లండన్ నుంచి దక్షిణాఫ్రికాకు తిరిగొచ్చారు. అయితే ఆమెలో కరోనా లక్షణాలు కనపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలను మృతి చెందారు.

ప్రస్తుతం గీతా రాంజీ దక్షిణాఫ్రికా వైద్యపరిశోధన మండలి(SAMRC) లోని క్లినికల్‌ ట్రయల్స్‌ విభాగంలో సైంటిస్టుగా ఉన్నారు. అంతేకాకుండా హెచ్ఐవీ ప్రివెన్షన్ రీసర్చ్ టీమ్ కు లీడర్. 2018లో యూరోపియన్ డెవలప్ మెంట్ క్లినికల్ ట్రయల్స్ పార్ట్ నర్ షిప్ ఆమెను ఔట్ స్టాండింగ్ ఫిమేల్ సైంటిస్ట్ అవార్డు తో సత్కరించారు.

ఇప్పటికే దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ సోకి ఐదుగురు మరణించగా… భారత సంతతికి చెంది ఇది మొదటి కేసు
గీతా రాంజీ మృతి పట్ల సౌతాఫ్రికా మెడికల్ రీసర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సీఈవో గ్లెండా గ్రే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Latest Updates