మౌంటెన్ నైట్ ఫ్లయింగ్‌ను షురూ చేసిన రాఫెల్ ఫైటర్స్

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ నుంచి ఐదు రాఫెల్ ఫైటర్స్‌ ఇండియా అమ్ముల పొదిలో వచ్చి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫైటర్స్ నైట్ ఫ్లయింగ్‌ను మొదలుపెట్టాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వత భూభాగాల మీదుగా ఫ్లయింగ్‌ను స్టార్ట్‌ చేశాయి. ఈ నేపథ్యంలో 1,597 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న లైన్ ఆఫ్​ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితులను బట్టి అటాక్ చేయడానికి ఫైటర్స్ సిద్ధమవుతున్నాయి. డసాల్ట్ ఏవియేషన్‌తో 36 రాఫెల్ ఫైటర్స్ కోసం ఇండియా ఒప్పందం చేసుకుంది. వీటిలో నుంచి ఫస్ట్‌ బ్యాచ్‌లో భాగంగా ఐదు జెట్స్‌ గత నెల 29న అంబాలా ఎయిర్‌‌బేస్‌కు చేరుకున్నాయి. తర్వాతి బ్యాచ్‌లో 18 ఫైటర్స్ భూటాన్‌కు సమీపంలోని హసిమరా ఎయిర్‌‌బేస్‌లో చేరుకోనున్నాయి.

రాఫెల్ ఫైటర్స్‌ను లడఖ్‌ సెక్టార్‌‌లో ట్రెయినింగ్‌కు కూడా వాడుకోవచ్చని మిలిటరీ ఏవియేషన్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఈ ఫైటర్స్‌లో ప్రోగ్రామబుల్ సిగ్నల్ ప్రాసెసర్స్ (పీఎస్పీ)తో డిజైన్ చేశారు. తద్వారా ఘర్షణలను బట్టి సిగ్నల్ ఫ్రీక్వెన్సీలను మార్చుకునే సదుపాయం ఉంది. ‘ఆక్రమిత ఆక్సాయ్‌ చిన్‌లోని పర్వత శిఖరాలపై చైనా తన ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ రాడార్లను ఉంచింది. అయినప్పటికీ యుద్ధ సమయంలో రాఫెల్ ప్రాక్టీస్ మోడ్ కంటే వైవిధ్యంగా పని చేస్తుంది. చైనా ఎయిర్‌‌క్రాఫ్ట్‌ రాడార్లు కూడా బాగున్నాయి. ఎందుకంటే అవి యూఎస్ ఎయిర్‌‌ఫోర్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించినవి’ అని ఓ నిపుణుడు చెప్పారు.

Latest Updates