యువతిపై లైంగిక దాడి.. తండ్రి అరెస్ట్

కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేస్తే… ఏం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలి? భర్త కూతురిపై అత్యాచారం చేస్తుంటే కాపాడాల్సిన తల్లి.. అప్పటికే గృహహింసకు గురవుతుండటంతో మౌనంగా ఉండిపోయింది. దాంతో ఈ దారుణాన్ని 10 ఏళ్లుగా భరిస్తూ వచ్చిన 23 ఏళ్ల యువతి.. తన చెల్లెలితో కూడా తండ్రి అలాగే ప్రవర్తించడంతో తట్టుకోలేకపోయింది. తన తండ్రి తమపై చేస్తున్న అకృత్యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లోని కోటాలో జరిగింది. భారత రైల్వేలో పనిచేసే తమ తండ్రి.. ఆయన పనిచేసిన వివిధ ప్రదేశాలలో తనపై పదేపదే అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ బాధితురాలు భీమ్‌గంజ్‌మండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం గురించి తమ తల్లికి తెలుసని, కానీ తండ్రి అప్పటికే చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆమె కూడా ఎదురించలేకపోయిందని యువతి తెలిపింది.

యువతి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షించే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు కానీ ఇంకా అరెస్టు చేయలేదని ఓ అధికారి తెలిపారు. కాగా.. యువతిని వైద్య పరీక్షల కోసం పంపించామని.. ఆమె స్టేట్మెంట్ ను సెప్టెంబర్ 28న మేజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

For More News..

దిశ ఘటనను అచ్చుగుద్దినట్లు దింపిన ఆర్జీవీ ‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్

తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు

వీడియో: ల్యాండింగ్ సమయంలో కూలిన సైనిక విమానం.. 22 మంది మృతి

Latest Updates