రైళ్లలో దోపిడీకి యత్నిస్తే కాల్చివేతే: రైల్వేశాఖ

రైళ్లలో ప్రయాణించే వారికి మంచి సౌకర్యాలతో పాటు భద్రత ఏర్పాట్లను కల్పించేందుకు చర్యలు చేపట్టింది రైల్వే శాఖ. రైళ్లలో దోపిడిల సంఖ్య పెరిగిపోవడంతో దోపిడీ దొంగలపై దృష్టిపెట్టింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో దోపిడీకి యత్నించే దొంగలను కాల్చి వేయాలని డిసైడ్ అయ్యింది. రైల్వే పోలీస్‌ (GRP), రైల్వే రక్షక దళం (RPF) సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ. రైళ్లలో రక్షణగా సాయుధ బలగాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నారు అధికారులు. తెలంగాణ‌లో రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే అన్ని ఎక్స్‌ప్రెస్‌, కొత్త ప్యాసింజర్‌ రైళ్లకు రక్షణగా సాయుధ బలగాలను త్వరలోనే ఏర్పాటు చేయ‌నున్నారు. సిగ్నల్‌ టాంపరింగ్‌కు అవకాశమున్న ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్‌కు GRP, RPF ఆధ్వర్యంలో సంయుక్త బృందాల ఏర్పాటుకు అధికారులు సిద్ధ‌మ‌య్యారు.

Latest Updates