మార్చి 31 వరకు గూడ్స్ తప్ప అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు

కరోనా బాధితుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతుంది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సేవులు మినహా అన్ని నిలిపివేశారు. ఇప్పటికే మార్చి 29 వరకు విమాన సర్వీసులు నిలిపివేసిన కేంద్రం లేటెస్ట్ గా మార్చి 31 వరకు దేశంలోని గూడ్స్ రైళ్లు మినహా అన్ని ప్యాసింజర్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే జర్నీలో ఉన్న రైళ్లకు మినహాయింపునిచ్చింది. ఇవాళ అర్థరాత్రి వరకు కొన్ని రైల్వే సర్వీసులు నడవనున్నాయి. నిత్యం వేల మంది రైళ్లల్లో ప్రయాణం చేస్తుండటంతో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది.

ఇప్పటికే భారత్ లో 341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బీహార్ లో ఒకరు, మహారాష్ట్రలో మరొకరు చనిపోవడంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటగా మరణాల సంఖ్య 13 వేలు దాటింది.

Latest Updates