తత్కాల్ టికెట్ల తో నాలుగేళ్లలో రూ.25 వేల కోట్లు

  • రైల్వే తత్కాల్​ టికెట్ల ఆదాయం

తత్కాల్‌‌ టికెట్లతో ఇండియన్‌‌ రైల్వేకు నాలు గేళ్లలో దాదాపు రూ. 25,392 కోట్ల ఆదాయం వచ్చిం ది. తత్కాల్‌‌ టికెట్ల ద్వారా రూ.21,530 కోట్లు, ప్రీమియమ్‌ తత్కాల్‌‌ టికెట్లతో రూ.3,862 కోట్లు ఆర్జించినట్లు రైల్వే శాఖ పేర్కొంది. మధ్యప్రదేశ్‌ కు చెందిన ఆర్టీఐ యాక్టివి స్ట్‌‌ చంద్రశేఖర్‌‌‌‌ గౌర్‌‌ అడిగిన ప్రశ్నకు ఈమేరకు జవాబిచ్చింది. 2016 – 19 మధ్యలో ప్రీమియం తత్కాల్‌‌ రెవెన్యూ 62 శాతం పెరిగిందని, 2016–17 సంవత్సరంలో తత్కాల్‌‌ టికెట్ల రెవెన్యూ రూ.6,672 కాగా.. 2017 – 18లో అది 6,952కు చేరిందని రైల్వే శాఖ చెప్పింది. ప్రస్తుతం 2,667 రైళ్లలో తత్కాల్‌‌ సదుపాయం ఉందని, మొత్తం 11.57 లక్షల సీట్లలో 1.71 సీట్లను తత్కాల్‌‌ బుకింగ్స్‌‌ కోసం కేటాయిస్తున్నట్లు చెప్పింది. 1997లో ఎంపిక చేసిన రైళ్లలో ప్రారంభించిన తత్కాల్‌‌ సేవలు 2004లో దేశంలోని అన్ని రైళ్లకు విస్తరించారు.

Latest Updates