రైల్వే నయా ప్లాన్: ఏటా రూ.800కోట్ల ఆదా

రైళ్లలో అదనపు బెర్తులను ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం 500 రైళ్ల నుంచి జనరేటర్ కార్లను తొలగించనుంది. వీటి స్థానంలో మరో 20వేల కొత్త బెర్తులు ఏర్పాటు చేయనుంది రైల్వే శాఖ. దీంతో రైళ్లలో మరింత ఆక్యుపెన్సీ పెరగనుంది. ప్రతీ ఏటా 800 కోట్ల రూపాయలు ఆదా అవనుంది.  దశల వారిగా జనరేటర్ కార్లను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు అధికారులు. భారతీయ రైల్వేలో తన బ్రాడ్ నెట్ వర్క్‌లో 100శాతం విద్యుదీకరణ చేయడానికి రెడీ అవుతుంది ప్రభుత్వం. దీంతో రైళ్లలో ఉన్న ఎలక్ట్రిక్ పరికరాల స్థానాలలో ప్రయాణీకుల కోచ్‌లు భర్తీకానున్నాయి.  దాదాపుగా 144 బెర్తులు నిర్మించడానికి అనువుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మరింత మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు వెళ్లే వీలుంటుండటంతో పాటు ఆర్థికంగా రైల్వేకు కూడా లాభంకానుంది.

Latest Updates