సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనాకు మందు

కరోనావైరస్ కోసం వ్యాక్సిన్ సెప్టెంబర్ చివరి నాటికి మార్కెట్లో లభిస్తుందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ పూనవల్లా అన్నారు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ బారిన పడి వేలమంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా అయితే ఏకంగా రెండు లక్షలక పైగా చనిపోయారు. ఇప్పటికీ ఆ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. దాంతో ప్రపంచదేశాలన్నీ కరోనాకు విరుగుడు కనిపెట్టే పనిలో పడ్డాయి.

మనదేశానికి చెందని పలు కంపెనీలు, శాస్త్రవేత్తలు కూడా వైరసుకు మందు కనిపెట్టె దిశగా అడుగులు వేస్తున్నారు. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా అమెరికా శాస్త్రవేత్తలతో కలిసి అదే పనిలో ఉంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా వైరస్ కు మందు అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ అంటున్నారు.

మే నెల చివరి నాటికి వైరస్ కు విరుగుడు తయారు అవుతుంది. మేం దాన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు క్లినికల్ ట్రయల్స్ చేస్తాం. అది విజయవంతమైతే ఇండియాకు మరియు ప్రపంచానికి యాంటీ వైరస్ మందును అందిస్తాం. చాలామంది శాస్త్రవేత్తలు వైరస్ కు విరుగుడు కనిపెట్టడానికి రెండు సంవత్సరాలు లేదా కనీసం 18 నెలల సమయం పడుతుందని అన్నారు. మేం కూడా ఎక్కువ సమయం పడుతుందని అనుకున్నాం. కానీ, మేం ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయడం ప్రారంభించాక.. తక్కువ టైంలోనే కనిపెట్టోచ్చని అనుకుంటున్నాం. కోడజెనిక్స్ మరియు యుఎస్ భాగస్వాములతో కలిసి టీకా ఉత్పత్తిని 2021 వరకు చేస్తామని చెప్పాం. కానీ, వారం క్రితం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలసి పనిచేయడం ప్రారంభించాక చాలా పురోగతి వచ్చింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కనిపెట్టిన వ్యాక్సిన్ తో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 23న 100కు పైగా క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. మరికొన్ని క్లినికల్ ట్రయల్స్ అమెరికా మరియు చైనాలో కూడా మొదలయ్యాయి. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే రూ. 1000 మార్కెట్లో దొరుకుతుంది.

ఎబోలా వైరస్ కోసం వ్యాక్సిన్ తీసుకురావడంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ విజయం సాధించింది. అందుకే ఆ యూనివర్సిటీపై నమ్మకంతోనే వారితో కలిసి పనిచేస్తున్నాం. మలేరియా వ్యాక్సిన్ కోసం కూడా మేం ఈ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మేం ఆక్స్ ఫర్డ్ తో పాటు అమెరికన్ సంస్థ అయిన కోడజెనిక్స్ తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. కోడజెనిక్స్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి లైవ్ అటెన్యూయేటెడ్ వైరస్ ను ఉపయోగిస్తోంది. దానితో జంతువులపై పరీక్షలను కూడా నిర్వహిస్తోంది’ అని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ పూనవల్లా తెలిపారు.

For More News..

లాక్డౌన్ ఎఫెక్ట్: చెక్క పడవలో 1100 కిలోమీటర్ల ప్రయాణం

Latest Updates