‘ఫెలుదా’.. తక్కువ ఖర్చుతో కరోనా టెస్ట్​

  •  గంటలోపే ప్రక్రియ పూర్తి

న్యూఢిల్లీ: ఖరీదైన మిషన్ల అవసరం లేకుండానే తక్కువ ఖర్చుతో కరోనా వైరస్​ను కనిపెట్టే పద్ధతిని కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్ ​అండ్​ఇండస్ట్రియల్ రీసెర్చ్​(సీఎస్‌ఐఆర్)కు చెందిన ఇన్‌స్టిట్యూట్​ ఆఫ్​ జెనోమిక్స్ ​అండ్ ​ఇంటెగ్రేటివ్ ​బయాలజీ సైంటిస్టులు అభివృద్ది చేశారు. ఈ టెస్ట్​ చేసేందుకు సుమారు గంట సమయం మాత్రమే పడుతుంది. ఈ సిస్టమ్​కు ‘ఫెలుదా’ అని సైంటిస్టులు పేరు పెట్టారు. ఫిల్మ్​ డైరెక్టర్ ​​సత్యజిత్​రే కథలోకి డిటెక్టివ్ ​పేరును ఈ టెస్ట్​కు పెట్టారు. సార్స్ ను క్లినికల్​గా నిర్ధారించే సులభమైన మార్గం ద్వారా ఈ టెస్ట్ ను డెబోజ్యోతి చక్రవర్తి, సౌవిక్​మైతి అభివృద్ధి చేశారని ఐజీఐబీ డైరెక్టర్ ​అనురాగ్​ అగర్వాల్​ చెప్పారు.

Latest Updates