గోల్డెన్ గాళ్ హిమదాస్.. ఇచ్చిన మెసేజ్ సూపర్..!!

ఒకప్పుడు పరుగుకే పనికి రాదన్నారు. కానీ.. ఇండియా చిరుత అనిపించుకుంటోంది. చెప్పులు లేకుండా పరుగెత్తింది. ఇపుడు ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ షూ కంపెనీకే బ్రాండ్ అంబాసిడర్ అయింది. కష్టానికి మారుపేరుగా నిలిచిన రైతు బిడ్డ ఆమె. సంచార కుటుంబంలో పుట్టి.. కష్టానికి మారుపేరుగా మారింది. దేశానికి స్ఫూర్తిగా నిలిచింది. భారత పతాకాన్ని స్ర్పింట్ ఈవెంట్ లో అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడిస్తోంది.

హిమదాస్ అద్భుత ప్రదర్శనకు చెక్ రిపబ్లిక్ వేదికైంది. 20 రోజుల వ్యవధిలో ఐదు ఈవెంట్లలో వరుసగా విజేతగా నిలిచి.. ఐదు గోల్డ్ లు కొల్లగొట్టింది. క్లాడో అథ్లెటిక్ మీట్, కుంటో అథ్లెటిక్ మీట్, పోజ్నన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్, టబోర్ అథ్లెటిక్స్ మీట్, నోవె మెట్రో నాడ్ మెటుజి గ్రాండ్ ప్రిక్స్ లో బంగారు పతకం గెల్చుకుంది హిమదాస్.

ఐదే దురదృష్టం హిమదాస్ ను వెంటాడింది. సెప్టెంబర్ లో జరిగే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో అర్హత సాధించే అవకాశాన్ని హిమదాస్ తృటిలో తప్పించుకుంది. అర్హత ప్రమాణం అయిన 51.8 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. సీజన్ బెస్ట్ 52.09 సెకన్లతో రేసు పూర్తిచేసి టాప్ లో నిలిచింది.

400 మీటర్ల పరుగులో హిమదాస్ కెరీర్ బెస్ట్, ఇండియా బెస్ట్ 50.79 సెకన్స్.

2018 ఏషియన్ గేమ్స్ లో 2 గోల్డ్, ఒక సిల్వర్ మెడల్ తో ప్రతిభ చాటింది హిమదాస్. వరల్డ్ అండర్ 20 ఛాంపియన్ షిప్ లోనూ బంగారు పతకం సాధించింది. యునిసెఫ్ కు మొట్టమొదటి యూత్ అంబాసిడర్ గా ఎంపికై హిమదాస్ ఇప్పటికే రికార్డులకెక్కింది. అస్సాం స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గానూ కొనసాగుతోంది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి తనకు వచ్చే వేతనంనుంచి సగం మొత్తాన్ని హిమదాస్ .. అస్సాం వరద సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. అస్సాంకు సాయపడాలని కోరారు.

సోషల్ మీడియాలో హిమదాస్ పోస్ట్

ఐతే.. చెక్ రిపబ్లిక్ స్ర్పింట్ ఈవెంట్ లో ఐదో గోల్డ్ సాధించాక.. సోషల్ మీడియాలో హిమదాస్ ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. ఆ మెసేజ్ వైరల్ గా మారింది. “మన కలలను అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు… మనలోనే సూపర్ హీరో ఉన్నాడని నమ్మినప్పుడు… ఏ లక్ష్యం కూడా దూరంగా ఉండదు. ఏ ఛాలెంజ్ కూడా కఠినమైనదేమీ కాదు.” అని హిమదాస్ చెప్పింది.

హిమదాస్ ఇప్పుడు ఇండియా గోల్డెన్ గాళ్. అన్ స్టాపబుల్ రన్నర్. ప్రైడ్ ఆఫ్ ఇండియా ఫరెవర్.

Latest Updates