డోపింగ్ టెస్ట్ లో అడ్డంగా దొరికిన నిర్మల

న్యూఢిల్లీ: స్వదేశంలో 2017లో జరిగిన ఏషియన్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో రెండు గోల్డ్‌‌ మెడల్స్‌‌ నెగ్గిన స్ప్రింటర్‌‌ నిర్మల షెరాన్‌‌(24) డోపింగ్‌‌కు పాల్పడినట్లు తేలింది. దీంతో ట్రాక్‌‌ అండ్‌‌ ఫీల్డ్‌‌ డోపింగ్‌‌ కేసులను పరిశీలించే అథ్లెటిక్స్‌‌ ఇంటిగ్రిటీ యూనిట్‌‌(ఏఐయూ) ఆమెపై నాలుగేళ్ల బ్యాన్‌‌ విధించింది.  అంతేకాక ఏషియన్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో 4×400, 400 మీటర్ల రిలేల్లో నిర్మల గెలిచిన గోల్డ్‌‌ మెడల్స్‌‌ కూడా వెనక్కు తీసుకోనుంది.  2018 జూన్‌‌లో ఇండియాలో జరిగిన ఓ ఈవెంట్‌‌ సందర్భంగా ఏఐయూ నిర్మల శాంపిల్స్‌‌ను సేకరించింది. నిషేధిత డ్రొస్టానొలోన్‌‌, మెటానొలోన్‌‌ స్టెరాయిడ్లను ఆమె వాడినట్లు పరీక్షల్లో తేలింది. డోపింగ్‌‌కు పాల్పడినట్లు నిర్మల కూడా అంగీకరించింది.

Latest Updates