కరోనా ఎఫెక్ట్: జ్వరం వచ్చిన వారంలోపే మృతి

  • యూఏఈలో చనిపోయిన మహిళా టీచర్

దుబాయ్: యూఏఈలో టీచర్ గా పనిచేస్తున్న ఇండియన్ కరోనాతో చనిపోయారు. అబుదాబిలోని ఇండియన్ స్కూల్​లో సీనియర్ టీచర్ అయిన కేరళకు చెందిన ప్రిన్సీ రాయ్ మాథ్యూ అనే మహిళ కరోనావైరస్ బారిన పడి బుధవారం రాత్రి మరణించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. కేరళకు చెందిన ప్రిన్సీ రాయ్​కి ముగ్గురు పిల్లలున్నారు. ప్రిన్సీ మరణంతో షాక్ కు గురయ్యామని ఆమె భర్త రాయ్ మథ్యూ శామ్యూల్ ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరం వచ్చిన వారం రోజుల్లోనే ఆమె పరిస్థితి క్షీణించిందని, శ్వాసకోశ సమస్య రావడంతో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ కన్పామ్ అయినట్లు వెల్లడించారు. ప్రిన్సీ మృతి పట్ల స్కూల్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. యూఏఈలో ఇప్పటివరకు మొత్తం కరోనావైరస్ కేసులు 11,929 నమోదు కాగా 98 మంది చనిపోయారు.

 

Latest Updates