ఆన్ లైన్ చెస్ ఛాంపియ‌‌షిప్‌‌ సెమీస్‌లో ఇండియా జట్లు

ఏషియన్‌‌ నేషన్స్‌‌(రీజియన్స్) ఆన్‌‌లైన్‌‌ చెస్​ లో అదరగొడుతున్న ఇండియా జట్లు

చెన్నై : ఏషియన్‌‌ నేషన్స్‌‌(రీజియన్స్) ఆన్‌‌లైన్‌‌ చెస్​  చాంపియన్‌‌షిప్‌‌ లో ఇండియా టీమ్స్‌‌ అదరగొడుతున్నాయి. పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌‌ దూసుకెళ్లాయి. క్వార్టర్‌‌ ఫైనల్‌‌లో మహిళల టీమ్‌‌ కిర్గిజిస్తాన్‌‌పై, మెన్స్‌‌ టీమ్‌‌  మంగోలియాపై  విజయాలు సాధించాయి.   కిర్గిజిస్తాన్‌‌తో జరిగిన రెండు రౌండ్ల మ్యాచ్‌‌లో మహిళల టీమ్​ 4–0,  3.5–0.5 స్కోర్లుతో  విజయం సాధించింది. యంగ్‌‌ గ్రాండ్‌‌మాస్టర్‌‌ ఆర్‌‌. వైశాలి.. ఆడిన రెండు మ్యాచ్‌‌ల్లోనూ తన ప్రత్యర్థికి షాకిచ్చింది. పద్మినీ రౌత్‌‌, పీవీ నందిదా కూడా రెండేసి విక్టరీలు సాధించారు. భక్తి కులకర్ణి సెకండ్‌‌ మ్యాచ్‌‌లో అర పాయింట్‌‌ కోల్పోయినా.. ఇండియానే పైచేయి సాధించింది . శనివారం జరిగే మహిళల సెమీస్‌‌లో  మంగోలియాతో ఇండియా తలపడనుంది.  మరోపక్క మెన్స్‌‌ క్వార్టర్స్‌‌లో మంగోలియా నుంచి ఎదురైన గట్టి పోటీని తట్టుకున్న ఇండియా రెండు మ్యాచ్​ల్లోనూ 2.5–1.5 స్కోర్లతో గెలిచింది.  ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో నిహాల్‌‌ సరిన్‌‌ ఓడిపోగా, సేతురామన్‌‌, శశికిరణ్‌‌ విజయాలు సాధించారు. కెప్టెన్‌‌ సూర్యశేఖర్​ గంగూలీ డ్రాతో సరిపెట్టాడు.  సెకండ్‌‌ మ్యాచ్‌‌లో ఆదిబన్‌‌, నిహల్‌‌  విజయాలు సాధించగా. గంగూలీ ఓటమి పాలయ్యాడు. శశికిరణ్‌‌ డ్రాతో గట్టెక్కడంతో ఇండియా ముందడుగు వేసింది. సెమీస్‌‌లో ఇరాన్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

Latest Updates