జయహో ఇండియా.. ఎన్‌కౌంటర్ ముగిశాక జవాన్ల సంబరాలు

జమ్ములోని రాంబాన్ జిల్లా బటోట్ మార్కెట్ ఏరియాలో సుదీర్ఘంగా కొనసాగిన ఎన్ కౌంటర్ ముగిసింది. సైన్యం, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు 8 గంటల పాటు కష్టపడి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. వారి చేతిలో బందీగా ఉన్న ఓ స్థానికుడిని ప్రాణాలతో కాపాడారు.

జవాన్ల తెగువను స్థానికులు ప్రశంసించారు. జవాన్లతో సెల్ఫీలు దిగారు. ఎన్ కౌంటర్ ఆపరేషన్ ముగిశాక.. సైనికులు భారత్ జిందాబాద్.. పాకిస్థాన్ ముర్దాబాద్.. జయహో ఇండియా అంటూ నినాదాలు చేశారు. వారి జయజయధ్వానాలతో.. ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది.

Latest Updates