కర్మకాండలు చేసిన రెండేళ్ల తర్వాత… బతికున్నానని వచ్చింది

సినిమా కథను మించిన డ్రామా ఓ మహిళ జీవితంలో జరిగింది. మూడేళ్ల క్రితం ఓ భారత మహిళ.. ఉద్యోగ నిమిత్తం వేరే దేశానికి వెళ్లింది. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లింది. ఎన్ని రోజులైనా.. సదరు మహిళ సమాచారం ఆమె కుటుంబ సభ్యులకు చేరక పోయేసరికి.. వారు కువైట్ లో ఆమెతో నివసించిన స్నేహితులను వాకబు చేశారు. దీంతో తను చనిపోయిందని చెప్పారు. చేసేదేమి లేక సదరు మహిళకు కుటుంబ సభ్యులు కర్మకాండలు నిర్వహించారు. సరిగ్గా ఈ విషయం జరిగిన రెండు సంవత్సరాలకు నేను బ్రతికే ఉన్నాని ఆ మహిళ నుంచి  తన కుటుంబ సభ్యులకు మెసేజ్ వెళ్లింది. ఊహించని ఈ పరిణామానికి గురైన ఆమె కుటుంబ సభ్యులు ఆనందానికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే…

ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకట లక్ష్మీ అనే మహిళ.. మూడేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం కువైట్ కు వెళ్లింది.  ఓ రోజు ఆఫీస్ కు వెళ్లిన లక్ష్మికి యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఈ విషయాన్ని వెంటనే కువైట్ లో ఉన్న భారత కార్యాలయానికి చేరవేశారు. అయితే ఆమె భారత్ లోని ఏ ప్రదేశం నుండి కువైట్ వచ్చిందో తెలియలేదని అధికారులు తెలిపారు. దీంతో ఈ రెండేళ్లు లక్ష్మిని హాస్పిటల్ లోనే ఉంచారు.

ఎట్టకేలకు వెంకట లక్ష్మి కొద్ది రోజుల క్రితం కోమానుండి బయటకు వచ్చింది. దీంతో భారత్ లో ఉన్న తన కుటుంబానికి మెసేజ్ పంపింది. లక్ష్మి బతికి ఉందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కువైట్ లోని ఇండియన్ ఎంబసీ.. తన సొంత కర్చులతో ఒక నర్సును ఇచ్చి లక్ష్మిని ఇండియాకు పంపించింది.

Latest Updates