భారత్, అమెరికా.. రెండు పౌరసత్వాలూ కావాలి

 కేంద్ర ప్రభుత్వానికి ఎన్​ఆర్​ఐల వినతి

అమెరికా పౌరసత్వం పొందిన ఎన్​ఆర్​ఐలు మన దేశ పౌరసత్వం వదులుకోవాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. అయితే, దాన్ని రద్దు చేయాలంటున్నారు చాలా మంది ఎన్​ఆర్​ఐలు. అమెరికా సిటిజన్​ షిప్​తో పాటు ఇండియా పౌరసత్వమూ ఉండాలంటున్నారు. అమెరికాలోని ఫౌండేషన్​ ఫర్​ ఇండియా అండ్​ ఇండియన్​ డయాస్పోరా స్టడీస్​ (ఎఫ్​ఐఐడీఎస్​) చేసిన సర్వేలో అందరూ ఇదే అభిప్రాయం వెల్లడించారు.

‘‘చాలా దేశాల ప్రజలు తమ సొంత పౌరసత్వం వదిలేసుకోకుండా అమెరికా సిటిజన్​షిప్​కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కానీ, ఇండియన్లకు మాత్రం ఆ అవకాశం లేదు. దీంతో చాలా మంది ఎన్​ఆర్​ఐలు దానిపైనే ఇండియా ప్రభుత్వానికి రిక్వెస్ట్​ చేస్తున్నారు. కానీ, దాన్నెవరూ పట్టించుకోలేదు” అని ఎఫ్​ఐఐడీఎస్​ తెలిపింది. ఓటింగ్​పైనా అభిప్రాయాలను పంచుకున్నారు. దాదాపు 33% మంది ప్రాక్సీ ఓటింగ్​కు ఓటేశారు. 28% మంది డైరెక్ట్​ పోస్టల్​ బ్యాలెట్​ కావాలన్నారు. గ్రీన్​కార్డ్​ రావడంలో సమస్యలున్నాయని 80% మంది చెప్పారు. హెచ్​1బీ, ఎల్​1 వీసాల్లో సమస్యలున్నాయని 60%, హెచ్​4, ఈఏడీ వీసాల్లో సమస్యలొస్తున్నాయని మరో 30% మంది పేర్కొన్నారు. కోటా నిబంధన వల్ల శాశ్వత నివాస హోదా కోసం ఏళ్లతరబడి ఎదురు చూడాల్సి వస్తోందన్నారు.