దసరా సీజన్ : 4.5 రోజుల్లో రూ.22 వేల కోట్ల షాపింగ్ చేసిన భారతీయులు

ఆన్ లైన్ అమ్మకాలు చూస్తుంటే ఫెస్టివల్స్ పై కరోనా ప్రభావం ఏమాత్రం లేదనే చెప్పుకోవాలి. ఆన్ లైన్ అమ్మకాలపై సర్వేలు నిర్వహించే రెడ్‌సీర్ గణాంకాల ప్రకారం మనదేశంలో దసరా,దీపావళి సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజాలు నిర్వహించిన ఫెస్టివల్ సేల్స్ మొదటి 4.5 రోజుల్లో సుమారు రూ.22వేల కోట్ల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, స్మార్ట్‌ఫోన్‌ లపై ఉన్న డిమాండ్ నేపథ్యంలో చిన్ననగరాల నుంచే సుమారు 3.1 బిలియన్ డాలర్ల వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేశారు.

ప్రతీ సంవత్సరం ఫ్లిప్ కార్ట్,అమెజాన్ లు కొనుగోలు దారుల్ని అట్రాక్ట్ చేసేందుకు భారీ ఎత్తున అమ్మకాల్ని నిర్వహిస్తాయి. దసరా, దీపావళి ముందు రోజుల్లో వారం రోజుల పాటు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ పేరుతో  ఆఫర్లను ప్రకటిస్తాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది ఆఫర్లను ప్రకటించడంతో కరోనాని పట్టించుకోకుండా  భారతీయులు తమకు నచ్చిన వస్తువుల్ని ఆన్ లైన్ లో కొనుగోలు చేశారు.

ఈ నేపథ్యంలో అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ మాట్లాడుతూ అమ్మకం మొదటి 48 గంటల్లో జరిగిన సేల్స్ పరంగా ఇదే తొలిసారి అని అన్నారు. అమెజాన్ లో 48 గంటల్లో 1.1 లక్షలకు పైగా కొనుగోలు దారులు ఆర్డర్లు పెట్టినట్లు చెప్పారు. అదే సమయంలో కష్టమర్లు ఫ్లిప్‌ కార్ట్ కు చెందిన యాప్ ను 36 మిలియన్ మంది డౌన్ లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Latest Updates