కరోనా వ్యాక్సిన్ కోసం యూకేకు భారతీయులు

కరోనా నియత్రణ కోసం ప్రెజర్ తయారు చేసిన వ్యాక్సిన్ ను ప్రజలకు ఇవ్వాలని బ్రిటన్ నిల్ణయించింది. ఈ క్రమంలో భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది యూకే వెళ్లి.. వ్యాక్సిన్ వేసుకోడానికి రెడీ అయిపోతున్నారు. దీని కోసం ట్రావెల్ ఏజన్సీలను సంప్రదిస్తూ… లండన్ కు వెళ్లేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఇండియన్స్.

లండన్ లో వచ్చే వారంలో ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభం కానుండగా, ఇప్పటికే భారత్ కు చెందిన ఓ ట్రావెల్ ఏజంట్, మూడు రాత్రుల ప్యాకేజీని ప్రకటించింది. తాము యూకే వెళితే వ్యాక్సిన్ ను ఎక్కడ, ఎప్పుడు ఎలా తీసుకోవచ్చని ఎంతో మంది తమను అడుతున్నట్లు ముంబైకి చెందిన ఓ ప్రముఖ ట్రావెల్ ఏజంట్ తెలుపుతున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేమని మాత్రమే తాము సమాధానం ఇస్తున్నామన్నారు. ఇక్కడి నుంచి వెళ్లే ఇండియన్స్ కు వ్యాక్సిన్ ఇస్తారా? అన్న విషయంపైనా ఇంకా సమాచారం లభించలేదని ఆయన తెలిపారు.

ఇండియన్ పాస్ పోర్టు ఉన్నవారు కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటిస్తే, ఇక్కడి నుంచి వందల సంఖ్యలో టికెట్లు లండన్ కు బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు ‘ఈజ్ మై ట్రిప్ డాట్ కామ్’ సహ వ్యవస్థాపక సీఈఓ నిశాంత్ పిట్టి. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి లండన్ కు ఎవరు వెళ్లినా, ఐదు రోజుల సెల్ఫ్ ఐసొలేషన్ తప్పనిసరి. ఆ తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నాక.. దేశంలో పర్యటించేందుకు అనుమతి ఉంటుంది.

Latest Updates