30ల‌క్ష‌ల దాటిన క‌రోనా రిక‌వ‌రీ కేసులు

మ‌న‌దేశంలో క‌రోనా రిక‌వ‌రీ కేసుల సంఖ్య 30 ల‌క్ష‌లు దాటి, రిక‌వ‌రీ రేటు 77శాతం న‌మోదైంద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. క‌రోనా మరణాలను తగ్గించడం, క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డం కేంద్రం’టెస్ట్-ట్రాక్-ట్రీట్’ వ్యూహంలో భాగ‌మ‌ని చెప్పింది.

దేశంలో మ‌ర‌ణాల‌రేటు ప్ర‌పంచంలోని స‌గ‌టు కంటే త‌క్కువ మ‌ర‌ణాలు మ‌న‌దేశంలో న‌మోద‌వుతున్నాయని, ప్రస్తుత సంఖ్య 1.74 శాతంగా ఉన్న‌ట్లు తెలిపిన కేంద్రం..ఇవి యాక్టీవ్ కేసుల క‌న్నా 0.5 శాతం తక్కువ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

రెండు శాతం కేసులు ఐసీయూల‌లో ఉన్నాయని, యాక్టివ్ కేసులలో 3.5 శాతం కన్నా తక్కువ. దీని ఫ‌లితంగా శ‌క్ర‌వారానికి దేశంలో క‌రోనా రిక‌వ‌రీ కేసుల సంఖ్య 30 లక్షలు (30,37,151) దాటాయి. గత 24 గంటల్లో 66,659 మంది రోగుల కోలుకోవడంతో, వరుసగా ఎనిమిదో రోజు 60,000 రికవరీ అయ్యారు.

క‌రోనా రోగుల రికవరీ రేటు 77.15 శాతం ఉండ‌గా గత కొన్ని నెలలుగా కోలుకుంటున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంద‌ని కేంద్రం వెల్ల‌డించింది.

Latest Updates