ఒక్కరోజే లక్షమంది రికవరీ..55 లక్షలకు చేరిన కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే 75,083 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 1053 మంది చనిపోయారు. వీటితో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55,62,664 కు చేరగా..మరణాల సంఖ్య 88,935 కు చేరింది.  ఇక గత మూడు రోజులుగా ప్రతి రోజు 90 వేలకు పైగా కోలుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 101468 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  44,97,868 మందికి చేరింది. ఇంకా 9,75,861 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

నిన్న ఒక్కరోజే 9,33,185 మందికి టెస్టులు చేశారు. దీంతో సెప్టెంబర్ 21 నాటికి  దేశంలో టెస్టుల సంఖ్య 6,53,25,779 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

 

Latest Updates